సీనియర్ నటులు పవిత్ర లోకేష్ – వీకే నరేష్ తమ మధ్య రిలేషన్‌ని బయటపెట్టక ముందే మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపించే వరకు వీరిమధ్య వ్యవహారం నడుస్తోందని చాలా మందికి తెలియదు.. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామంటూ లిప్ లాక్ చేసుకుంటున్న వీడియోతో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవలే పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.. తర్వాత హనీమూన్‌కి దుబాయ్ వెళ్లారంటూ కొన్ని పిక్స్, వీడియోస్ కూడా బయటకొచ్చాయి..
ఇదిలా ఉంటే.. పెళ్లి విషయం తెలిసినప్పటి నుండి పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.. పవిత్ర కర్ణాటకలోని మైసూర్లో పుట్టి పెరిగారు. తండ్రి మైసూర్ లోకేష్ కర్ణాటక స్టేట్, ఫిలిం యాక్టర్.. తల్లి టీచర్.. ఆది లోకేష్ అనే బ్రదర్ ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో.. కుటుంబ పోషణ కోసం తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు పవిత్ర.. కన్నడ నాట టీవీ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్గా ఎదిగారు..
ఇంకో విశేషం ఏంటంటే ఆమె చదువుకుంటూనే సినిమాల్లోకి వచ్చి.. డిగ్రీ కంప్లీట్ చేసి.. సివిల్స్‌కి సైతం ప్రిపేర్ అయ్యారు.. రిజల్ట్ తేడా కొట్టడంతో నటిగా కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యి.. హీరోయిన్గా మంచి పేరు సంపాదించి కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.. కన్నడలో దాదాపు 150 చిత్రాలు చేసిన పవిత్ర 2006లో ‘నాయి నేరాలు’ మూవీకి గానూ కర్ణాటక స్టేట్ అవార్డ్ అందుకున్నారు.. ఇక పర్సనల్ విషయానికొస్తే.. పవిత్ర మొదట ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు..
కొద్ది రోజుల తర్వాత విడిపోయారు.. తర్వాత (2007) కన్నడ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్‌తో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి.. 2018లో అతని నుండి విడిపోయారు.. హైలెట్ ఏంటంటే వీరు పెళ్లి చేసుకోలేదు కానీ ఇద్దరు పిల్లలున్నారు.. చిన్న గ్యాప్ అనంతరం నరేష్‌తో ప్రేమలో పడ్డారు పవిత్ర.. ఆమె డబ్బు మనిషి.. లగ్జరీ లైఫ్ కోసం ఏమైనా చేస్తుందంటూ సుచేంద్ర కామెంట్స్ చేశారు.. ఇదంతా తెలిసి నెటిజన్లు.. ఇక్కడికి ముగ్గురే కనిపిస్తున్నారు కానీ బయటకి తెలియకుండా ఇంకెన్ని ఎఫైర్స్ నడిపిందో పవిత్ర అంటూ కామెంట్స్ చేస్తున్నారు..