Rama Rajamouli: రాజమౌళి కంటే రమా రాజమౌళికి వేరే వ్యక్తితో పెళ్లయింది అన్న సంగతి మీకు తెలుసా..!

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ తో అతను తెలుగు సినిమా స్థాయిని అలాగే మార్కెట్ ను కూడా పెంచారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఆస్కార్ తెప్పించిన ఘనత కూడా ఆయనకే సొంతం. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే అలాగే బాలీవుడ్ లో మన సినిమాలకు డిమాండ్ పెరిగింది అంటే.. అది రాజమౌళి చలవే..!. ఇదిలా ఉండగా.. ‘ప్రతి మగాడి వెనుక ఓ ఆడది ఉంటుంది’ అన్నది జగమెరిగిన సత్యం.

రాజమౌళి సక్సెస్ వెనుక కూడా ఆయన నటీమణి రమా రాజమౌళి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. రాజమౌళి తీసే ప్రతి సినిమా మేకింగ్ వీడియోలను బట్టి ఈ విషయాన్ని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.అలాగే ఏ సినిమా వేడుకకు రాజమౌళి వెళ్లినా.. ఆయన వెంట రమా రాజమౌళి కూడా వెళ్తుంటారు. అయితే రాజమౌళి.. రమా రాజమౌళికి మొదటి భర్త కాదు అన్న విషయం చాలా మందికే తెలిసే ఉంటుంది. గతంలో రమా రాజమౌళి.. ఓ సంగీత దర్శకుడిని వివాహం చేసుకున్నారట.

ఎం.ఎం.కీరవాణి కుదిర్చిన సంబంధం అది. కాకపోతే పెళ్ళైన తర్వాత.. (Rama Rajamouli) రమని.. ఆమె మొదటి భర్త బాగా వేధించేవాడట. కానీ ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఒకసారి ఈ విషయం కీరవాణికి తెలియడంతో విడాకులు ఇప్పించేశారట. రమ తన మొదటి భర్తతో విడిపోయిన టైంకి ఆమెకు ఓ బాబు(కార్తికేయ) ఉన్నాడు. అటు తర్వాత రాఘవేంద్రరావు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చింది ఆమె.

ఇక కీరవాణి కజిన్ అయిన రాజమౌళితో రమకి పరిచయం ఏర్పడటంతో అది ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. రాజమౌళిని రాఘవేంద్ర రావు గారి వద్ద పనిలో పెట్టింది రమ అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అలాగే కార్తికేయను.. రాజమౌళి సొంత కొడుకుగా చూసుకుంటూనే.. పిల్లలను కనడం ఇష్టం లేక.. ఓ పాపని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అలా టాలీవుడ్లో నిజమైన ఆదర్శ దంపతులుగా రాజమౌళి,రమ ల గురించి చెప్పుకోవచ్చు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus