Sandeep: ఒక్క కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సందీప్!

బుల్లితెరపై ఎన్నో డాన్స్ షో కార్యక్రమాలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. ఈ డాన్స్ షోల ద్వారా ఎంతో టాలెంట్ కలిగిన వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆట డాన్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో సందీప్ మాస్టర్ ఒకరు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పార్టిసిపేట్ చేసి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈ కార్యక్రమం తర్వాత ఆట సందీప్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తరచూ ఎన్నో రకాల డాన్స్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినటువంటి సందీప్ మాస్టర్ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సందీప్ మాస్టర్ 8 వారాలపాటు కొనసాగుతూ అనంతరం ఎనిమిదవ వారం బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇలా వరుస ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి ఈయన తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సందీప్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు శేఖర్ మాస్టర్ చాలా ఇన్స్పిరేషన్ అనే తెలిపారు. ఆయన ప్రతి ఒక్కరితోనూ చాలా మంచిగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని తెలియజేశారు.

ఇక తనకు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాను అని తెలిపారు. ఇక ఇప్పుడు కూడా నటుడుగా కొన్ని సినిమాలలో తనకు ఛాన్స్ వస్తుందని సందీప్ మాస్టర్ వెల్లడించారు. ఇక ఈయన పలు కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇలా ఒక డాన్స్ షోకి హాజరైతే తాను 50వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాను అంటూ ఈ సందర్భంగా (Sandeep) సందీప్ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus