వెంకటేష్ ప్లాప్ సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్ చెయ్యడం లేదు కదా..!

  • March 17, 2021 / 11:52 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏ సినిమా చేసినా.. అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. మినిమం గ్యారెంటీ హీరో అని అక్కడి దర్శకనిర్మాతలు అలాగే కచ్చితంగా ఇతని సినిమాల్లో కంటెంట్ ఉంటుందని అక్కడి ప్రేక్షకులు బలంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో అతను చెయ్యబోతున్న ‘రామ సేతు’ చిత్రం పై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. అభిషేక్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని చంద్రప్రకాశ్ ద్వివేది,అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థీమ్ కాస్త మన తెలుగు సినిమా అయిన ‘దేవి పుత్రుడు’ కి దగ్గరగా ఉందనేది కొందరి అభిప్రాయం.

అయితే ఇది వ్యక్తం చేస్తుంది తెలుగు సినీ విశ్లేషకులు కాదు హిందీ సినీ విశ్లేషకులే..! మేటర్ లోకి వెళ్తే.. దక్షిణ భారతం చివరి నుండీ శ్రీలంక వరకూ ఒకప్పుడు రామ సేతు ఉండేదని పురాణాల మాట.ఆ కాలంలో శ్రీరాముడు వానరుల సాయంతో బ్రిడ్జి నిర్మించి, లంకకు వెళ్ళి సీతాదేవిని తీసుకొచ్చాడని పురాణాలు చెప్పుకొస్తున్నాయి.అయితే రామేశ్వరం దేవాలయంలోని రికార్డుల ప్రకారం మాత్రం 1480లో వచ్చిన తుఫాన్ కు ముందు వరకూ 48 కిలోమీటర్ల పొడవైన వంతెన ఒకటి సముద్ర పై భాగాన ఉండేదని అవి సాక్షార్థంగా ఉన్నాయి. ఈ క్రమంలో శాటిలైట్ చిత్రాలలో అక్కడో సేతువు ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయని తేలిందట. ఇలాంటి కథతోనే అక్షయ్ కుమార్ ‘మిథ్ ఆర్ రియాలిటీ’ అనే ట్యాగ్ లైన్ తో ‘రామసేతు’ మూవీ రూపొందుతోంది.

ఇక దేవి పుత్రుడు కథ ప్రకారం.. ద్వాపర యుగం చివర్లో కృష్ణుడు రాజ్యమేలిన ద్వారక నగరం జలసమాధి అయ్యిందని చాలా మంది చెబుతుంటారు. ఇప్పటికీ గుజరాత్ లోని బెట్ ద్వారక సమీపంలో ద్వారక శిధిలాలు ఉన్నాయని ఆ నాటి చిత్ర పటాలు కూడా చూపిస్తుంటారు.అయితే ఇక్కడ కృష్ణుడు గురించి .. ‘రామ సేతులో’ రాముడి గురించి. కానీ ఈ రెండు చిత్రాలలోనూ హీరోలు మాత్రం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ఉంటారని తెలుస్తుంది. అందుకే ‘దేవి పుత్రుడు’ వంటి ప్లాప్ సినిమా రీమేక్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడా? అని టాక్ నడుస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus