Neil Kitchlu: కాజల్ కుమారుడికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా?

వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం ఈమె తన కుమారుడిని తన తల్లి వద్ద ఉంచి తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ప్రస్తుతం మూడు సినిమాలతో కాజల్ అగర్వాల్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒకవైపు వృత్తిపరమైన జీవితంలోనూ మరోవైపు వ్యక్తిగత జీవితంలోను ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే కాజల్ అగర్వాల్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు తన కుమారుడికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా తన కుమారుడికి నీల్ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా ఈమె తెలియజేశారు .అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు పేరుకు గల అర్థమేంటి అనే విషయాల గురించి కాజల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ తనకు శివుడు అంటే ఎంతో ఇష్టమైన దేవుడని తెలిపారు. అందుకే ఆ నీలకంఠేశ్వరుడి పేరుని తన కుమారుడికి పెట్టాలని ఈమె భావించారట. అయితే అంత పెద్ద పేరు పలకడం రాయడం చాలా కష్టంగా ఉంటుందని భావించి నీలకంఠేశ్వరుడిలో నీల్ అనే పేరును ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఈ విధంగా నీలకంటేశ్వరుడులో నీల్ అనే పేరును పెట్టినట్లు కాజల్ తన కుమారుడి పేరు వెనుక ఉన్న అర్థం తెలిపారు.

నీల్ (Neil Kitchlu) అంటే సాక్షాత్తు పరమేశ్వరుడేనని తన కుమారుడి పేరు గురించి ఈ సందర్భంగా కాజల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ అనే సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ పనులలో కాజల్ అగర్వాల్ ఎంతో బిజీ అయ్యారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus