అసలు ఆ సినిమాలు మెయిన్ హీరో ఎవరో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు కదా!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ ఈ నలుగురు కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వీరందరికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీరి కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఇక వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద జాతరే. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పండగ వాతావరణం ఉండేది.

అయితే ఒక్కొక్కరిగా వీరి సినిమాలు రిలీజ్ అయితేనే రెండు రాష్ట్రాల్లో మాములు రచ్చ ఉండేది కాదు.. అలాంటిది వీరంతా కలిసి ఓకే సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అయితే ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ నలుగురు కలిసి ఓ సినిమా చేశారన్న సంగతి మీకు తెలుసా. కానీ అప్పట్లోనే వీరి కాంబోలో ఓ మూవీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన సినిమా త్రిమూర్తులు.

నిజానికి ఈ సినిమాలో హీరో వెంకటేష్. కానీ ఇందులో ఓ పాటలో (Chiranjeevi) చిరు, బాలయ్య, నాగ్ అతిథులుగా విచ్చేశారు. కేవలం ఈ నలుగురు మాత్రమే కాకుండా.. అలనాటి సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయశాంతి, భానుప్రియ సైతం ఈ పాటలో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ నలుగురు హీరోలను ఒకే ఫ్రేములో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

నేటి తరం హీరోలతో కలిసి అలనాటి హీరోలు కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలన్ని మల్టీ స్టార్ మూవ్సీగా మారిపోయాయి. ఒకే సినిమాలో తమ అభిమాన హీరోలను ఓకే సారి చూసి అనందపడుతున్నారు అభిమానులు. గోపాల..గోపాల సినిమా వెంకటేష్-పవన్ కల్యాణ్ అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్-రాంచరణ్, బాహుబలిలో ప్రభాస్-రానా వంటి హీరోలు కలిసి నటించారు. ఇక కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.. మల్టీస్టార్ సినిమాలు రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus