తెలుగు తమిళ భాషలలో నటుడిగా ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన అరవింద్ స్వామి గురించి పరిచయం అవసరం లేదు. తన సినీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నటువంటి అరవింద్ స్వామి ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయన బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు. ఇకపోతే ఈయన తండ్రి గారికి చెన్నైలో ఓ కంటి ఆసుపత్రి ఉండేది.
ఈ ఆసుపత్రి తో పాటు చెన్నైలో చిన్న చిన్న బిజినెస్ లు ఉండడంతో వాటిని చూసుకుంటూ ఈయన బిజినెస్ రంగంలో ఉండిపోయారు. అయితే వాటిని చూసుకుంటూనే ‘ట్యాలెంట్ మ్యాక్సిమస్’ అనే ఓ సంస్థని స్థాపించి ఆ సంస్థని ఓ రేంజ్ లో డెవలప్ చేశారు అరవింద్ స్వామి. ఈ సమస్త ఎవరికి ఎక్కడ ఎలాంటి సిబ్బంది అవసరం అయినా కూడా వారిని అరేంజ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ అరవింద్ స్వామి (Aravind Swamy) భారీగా సంపాదించారనే తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు 3300 కోట్లు. ఇవి కాకుండా చెన్నైలో ఉన్న హాస్పిటల్, తండ్రి, తనవి వ్యాపారాలతో కలిసి అరవిందస్వామికి దాదాపు 4000 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఈ రేంజ్ లో సంపాదించలేదని చెప్పాలి ఈయన ఇండస్ట్రీలో కంటే బిజినెస్ రంగంలోనే ఎంతో మంచి సక్సెస్ సాధించి భారీగా ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.
ఈ విధంగా ఈ హీరో బిజినెస్ రంగంలో మంచి సక్సెస్ అయిన తర్వాత తిరిగి సినిమాలలో ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈయన రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు పొందారు.తాజాగా కష్టడి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా అరవిందస్వామి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన బిజినెస్లను కూడా ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ సాధించారని చెప్పాలి.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!