ప్రభాస్ (Prabhas – దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందిన ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) చిత్రం ఇటీవల అంటే జూన్ 27న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్(Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఈ సినిమాలోని విజువల్స్ ఉండటం విశేషం. ఇక సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో..
మొదటి వారమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 90 శాతం రికవరీని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి రకరకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అతని స్క్రీన్ స్పేస్ తక్కువని, ప్రభాస్ కంటే అమితాబ్ (Amitabh Bachchan) పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారని.. ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే నాగ్ అశ్విన్ వాటిని కొట్టిపారేశారు. మొదటి భాగంలో పాత్రల పరిచయం కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల..
హీరో బ్యాక్ స్టోరీ గురించి అర్థమయ్యేలా చెప్పడం వల్ల.. ప్రభాస్ కి స్క్రీన్ స్పేస్ తగ్గింది అని క్లారిటీ ఇచ్చారు. మరోపక్క అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ కూడా ఇందులో చాలా గంభీరంగా ఉంటుంది. కానీ తన పాత్రకి అమితాబ్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు అంతా అనుకుంటున్నారు. కానీ తెలుగులో అమితాబ్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోలేదు. మరో ఎవరు చెప్పారు? అనే డౌట్ మీకు రావచ్చు.
ఇక్కడే నాగ్ అశ్విన్ తెలివితేటలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. హిందీలో అమితాబ్ ఎంత గంభీరంగా డబ్బింగ్ చెప్పారో.. కరెక్ట్ గా అదే సింక్ వచ్చేలా ‘ఏఐ'(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ని వాడి తెలుగులో డబ్బింగ్ చెప్పించారట. కానీ చాలా మంది అమితాబ్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నట్టు అనుకుంటున్నారు. అందులో నిజం లేదు.. ఏఐ ద్వారానే అమితాబ్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పించడం జరిగింది.