Kalki 2898 AD: కల్కిలో శ్రీ కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆ నటుడా.. ఎవరంటే?

  • June 27, 2024 / 09:28 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని తేలిపోయింది. ఎక్కువ సంఖ్యలో అతిథి పాత్రలు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులను సైతం మెప్పించడం గమనార్హం. ప్రభాస్ క్రేజ్ కు నాగ్ అశ్విన్ విజన్ తోడు కావడంతో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది.

3 గంటల నిడివితో తెరకెక్కినా ప్రేక్షకులకు బోరింగ్ ఫీలింగ్ కలగకుండా నాగ్ అశ్విన్ కథ, కథనాన్ని నడిపించారు. సినిమాలో ఫస్టాఫ్ ను మించి సెకండాఫ్ ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర ఉన్నా ఆ పాత్రకు సంబంధించిన నటుడి ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పింది మాత్రం ప్రముఖ నటుడు అర్జున్ దాస్ (Arjun Das) కావడం గమనార్హం.

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకున్న ఈ నటుడు తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణుడి పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ను ఆయన అద్భుతంగా పలికించారనే చెప్పాలి. కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ ను మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది.

ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా కల్కి 2898 ఏడీ అదరగొట్టాలంటే మేకర్స్ మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సినిమాకు ఇతర భాషల్లో కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా రేంజ్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus