Anushka: ‘బాహుబలి’ లో అనుష్క పాత్ర వెనుక ఆ హీరోయిన్ హస్తం ఉందా.. నిజంగా షాక్ ఇది..!

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి'(సిరీస్) తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, సుబ్బరాజు వంటి వారు ఈ మూవీలో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అనుష్కకి సైతం నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దేవసేన పాత్రకి ఆమె తన నటనతో జీవం పోసింది. మొదటి భాగంలో ఆమె ఎంట్రీ అందరినీ భయపెట్టే విధంగా ఉంటుంది.

మాహిష్మతి సామ్రాజ్యంలో భల్లాల దేవుడు పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ కూడా తన కొడుకు ఎప్పటికైనా వస్తాడు, బందీగా ఉన్న తనను విడిపించుకుని తీసుకెళ్తాడు అనే నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ లో యువరాణిగా ఎంతో హుందాగా నటించింది అనుష్క. అయితే ఈ సినిమాలో అనుష్కకి డూప్ గా ఓ హీరోయిన్ నటించింది అనే సంగతి మీకు తెలుసా?వినడానికి విడ్డూరంగా, షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ‘బాహుబలి'(సిరీస్) లో అనుష్కకి డూప్ గా ఓ హీరోయిన్ నటించింది.

ఆమె మరెవరో కాదు నటి రుషిక రాజ్.ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ మూవీలో ఈమె బోల్డ్ నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి.అయితే నిజానికి ఈమె మొదటి చిత్రం ‘అశ్మీ’ కాదు ‘బాహుబలి’. ఆ సినిమాలో ఈమె అనుష్క కి డూప్ గా నటించింది. లాంగ్ షాట్స్ లో అనుష్కలా కనిపించింది ఈమెనే..! ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన బాణం ఫైట్లో కూడా ఎక్కువగా నటించింది ఈమెనే..!

అంతేకాదు కొన్ని సన్నివేశాల్లో రమ్యకృష్ణ బ్యాక్ సైడ్ ఉండే బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపిస్తుంది. అనుష్క – రుషిక రాజ్ ఇద్దరూ కూడా సేమ్ హైట్. దూరం నుండి చూస్తే ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. అందుకే దర్శకుడు రాజమౌళి అనుష్క.. డూప్ గా రుషిక రాజ్ ను సెలెక్ట్ చేసి ఆమెను బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా వాడేశాడు. రుషిక రాజ్ మంచి నటి కూడా..! కాకపోతే ఆశించిన బ్రేక్ ఇంకా రాలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ లా పవర్ ఫుల్ రోల్స్ చేయాలని ఈమె ఆశపడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ లో కూడా ఈమెకు ఛాన్స్ దక్కింది. ఇదిలా ఉండగా.. ‘బాహుబలి’ లో ఈమె పాత్రకి సంబంధించిన రెండు అన్ సీన్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus