‘ఆదిపురుష్’ చిత్రం నిన్న అంటే జూన్ 16 న రిలీజ్ అయ్యింది. వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆధారం చేసుకుని తనకు నచ్చినట్టు మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ ఇది. హీరోయిన్ గా అంటే సీత పాత్రలో కృతి సనన్ నటించింది. విలన్ అంటే రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది.
ఇక ‘ఆదిపురుష్’ (Adipurush) కథని శూర్పనఖ పాత్రతోనే ప్రారంభించాడు దర్శకుడు ఓం రౌత్. రాముడి పై మనసు పడి పెళ్లి చేసుకోవాలని ఆశ పడిన ఆమె.. జానకి అడ్డు తొలగించాలని ప్రయత్నిస్తుండగా.. లక్ష్మణుడు(ఈ చిత్రంలో శేషు) ఆమె ముక్కు కోసేస్తాడు. దీంతో ఈ విషయం వెళ్లి తన అన్న రావణాసురుడికి చెబుతుంది శూర్పనఖ. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. అయితే ఈ శూర్పనఖ పాత్రలో చేసింది తేజస్విని పండిట్. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఈమె ఓ పాపులర్ హీరోయిన్.
2004 లో వచ్చిన ‘అగా బాయి అరేచా’ మూవీతో కెరీర్ ఆరంభించిన ఈమె మొదటి చిత్రంలోనే నెగిటీవ్ రోల్ తో మంచి మార్కులు వేయించుకుంది. బుల్లితెర పై పలు సీరియల్స్ లో కూడా ఈమె నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది. నిజజీవితంలో ఈమె చాలా గ్లామర్ గా ఉంటుంది. ఈమె చాలా వెబ్ సీరీస్ లలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉటుంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్