Salaar Teaser: ‘సలార్’ .. ‘కె.జి.ఎఫ్’ యూనివర్స్ లో భాగమేనా.. క్లారిటీ ఇచ్చిన టీజర్?

‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్, ‘కె.జి.ఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే అంచనాలు మామూలుగా ఏర్పడతాయా? ‘సలార్’ విషయంలో అదే జరుగుతుంది. ఫస్ట్ లుక్ దగ్గరనుండి ‘సలార్’ అంచనాలు పెంచుతూనే ఉంది. సెప్టెంబర్ 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ప్రకటించినప్పుడు ఆ అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది. తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాలకి ఈ టీజర్ ను విడుదల చేయడం జరిగింది . ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు అలారం పెట్టుకుని మరీ లేచి ‘సలార్’ టీజర్ ను చూశారు.

ఈ టీజర్ నిమిషం పైనే ఉన్నా.. ప్రభాస్ కనిపించిన షాట్స్ తక్కువే. అయినా అంచనాలకి ఏమాత్రం తగ్గలేదు ఈ టీజర్.

అయితే మొదటి నుండి ‘సలార్’ రెండు పార్టులుగా రాబోతున్నట్టు ప్రచారం జరిగినట్టుగానే ‘సలార్- సీజ్ ఫైర్’ పేరుతో మొదటి భాగం రాబోతుందని ఈ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అలాగే ‘కె.జి.ఎఫ్’ యూనివర్స్ లో భాగంగా ‘సలార్’ రూపొందుతున్నట్లు కూడా గాసిప్స్ వినిపించాయి. అది నిజమే అన్నట్టు టీజర్ లో కొన్ని గుర్తులు వదిలాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

‘కె.జి.ఎఫ్’ లో ఓ చోట LALF =82 అని ఉంటుంది. సరిగ్గా చూస్తే ‘సలార్’ టీజర్ లో కూడా LALF =82 అని కనిపిస్తుంది. ఇది యాదృశ్చికమో లేక నిజంగానే ‘సలార్’.. ‘కె.జి.ఎఫ్’ యూనివర్స్ లో భాగమా అన్నది ఆసక్తికరంగా మారింది.

సలార్ (Salaar) మొదటి పార్ట్ రిలీజ్ అయ్యే వరకు.. దీని పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి టీజర్ చూస్తూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్.. మాస్ అవతార్ లో కనిపిస్తుండటం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus