చై, శోభిత.. కొత్త ఫొటోల్లో ఇది గమనించారా?

  • April 23, 2024 / 09:41 PM IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) .. సమంతతో  (Samantha)  విడాకులు తీసుకుని రెండేళ్లు దాటింది. అయినా నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకోలేదు. సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. కానీ అతనిపై డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళతో (Sobhita Dhulipala) అతను డేటింగ్లో ఉన్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కాబట్టి.. నాగ చైతన్య కచ్చితంగా శోభిత ధూళిపాళని రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రచారం మొదలైంది.

దీని పై నాగ చైతన్య స్పందించాడు. ‘నాకు సంబంధం లేని మూడో వ్యక్తిని లాగి ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. శోభిత కూడా తన స్టైల్లో ఈ రూమర్స్ పై స్పందించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అంతా అయిపోయింది.. జనాలు దీన్ని పట్టించుకోవడం మానేశారు అని అంతా అనుకున్నారు. కానీ.. వీళ్ళ లేటెస్ట్ ఫోటోల వల్ల మళ్ళీ ఈ రూమర్స్ మొదలయ్యాయి. విషయమేంటి అంటే.. శోభిత రెండు ఇటీవల వెకేషన్ కి వెళ్ళింది.

దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఆమె ఒక జీపులో ప్రయాణిస్తున్న టైంలో తీసుకున్న ఫోటోలు అవి. కానీ ఆ ఫోటోలు Tipeshwar Wildlife Sanctuary లోనివి అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ తర్వాత నాగ చైతన్య కూడా తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని లొకేషన్ కూడా శోభిత పోస్ట్ చేసిన లొకేషన్లోనివే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ రకంగా వీళ్ళు మరోసారి వార్తల్లో నిలిచారు అని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus