బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్‌

మేం ఏం చేసినా నెటిజన్లు ట్రోల్‌ చేస్తుంటారు అని అంటుంటారు సెలబ్రిటీలు. అయితే అందులో నిజం లేకపోలేదు. అలా అని ఊరికనే ట్రోల్‌ చేయడానికి నెటిజన్లకు ఏం పని ఉండదా ఏంటి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ తేజస్వి మదివాడ పోస్ట్‌ చేసిన ఓ ఫొటోకు ఇప్పుడు అలాంటి ట్రోల్స్‌ వస్తున్నాయి. కావాలంటే ఒకసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి చూడండి. ఏంటీ… ఇన్‌స్టాలోకి వెళ్లి చూసొచ్చారా. అక్కడ ఏమన్నా కనిపించిందా!

‘ఏదో పాస్‌ఫొటో సైజ్‌ ఫొటో అని ఒకటి పోస్ట్‌ చేసింది. చూస్తే ఆ ఫొటో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలా లేదు… పొరపాటున అలా రాసిందేమో’ అంటారా. మీరు అలా అనుకోవచ్చు. ఇంకొందరేమో ‘ఇదెలా పాస్‌పోర్ట్‌ ఫొటో అవుతుంది’అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇంకొందరమేఓ ఏదో సరదాకి పెట్టిందిలే అనుకుంటారు. ఇప్పుడు నెటిజన్లు కూడా ఇలాంటి మాటలే ట్రోల్‌ రూపంలో చేస్తున్నారు. అర్థమైందిగా…. ఎప్పుడూ సెలబ్రిటీలను ట్రోలర్స్‌ టార్గెట్‌ చేస్తారు అని అంటుంటారు.

అయితే ఒక్కోసారి అనుకోకుండా సెలబ్రిటీలు చేసే పోస్టులు కూడా ట్రోలింగ్‌కి కారణం అవుతుంటాయి. తేజస్వి ఇలాంటివన్నీ పట్టించుకోదు లెండి. చాలా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ కదా… ఏమంటారు.

1

2

3

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus