ప్రస్తుతం స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న హీరోల చిన్నప్పటి విషయాలను తెలుసుకోవడానికి మనలో చాలామంది ఆసక్తి చూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి స్నేహితులలో డాక్టర్ సత్యప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యప్రసాద్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టీనేజ్ లో పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య అంటూ చిరంజీవిని వదిలేవారు కాదని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ బిర్యానీ కోసం పేచీ పెడితే చిరంజీవి,
సురేఖ పవన్ కళ్యాణ్ ను వెంటబెట్టుకుని స్లమ్ ఏరియాకు తీసుకెళ్లారని అక్కడ నివశిస్తున్న వాళ్లు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రాక్టికల్ గా వివరించి బిర్యానీ కోసం పేచీ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పారని సత్యప్రసాద్ వెల్లడించారు. తెలిసీ తెలియని వయస్సు నుంచి తెలిసే వయస్సుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సిగ్గు పడుతూ మాట్లాడేవారని సత్యప్రసాద్ చెప్పారు. చిరంజీవి చిన్నప్పటి నుంచే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవరచుకున్నారని.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డొనేషన్స్ ఇవ్వడం, సర్వీస్ చేయడం చిరంజీవి నుంచే పవన్ నేర్చుకున్నాడని సత్యప్రసాద్ వెల్లడించారు.
సత్యప్రసాద్ పాఠశాల నుంచి కాలేజీ వరకు చిరంజీవితో కలిసి చదువుకున్నారు. ఈ విషయం ద్వారా చిరంజీవి గుణం ఎటువంటిదో సత్యప్రసాద్ తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ వచ్చినా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి హెల్త్ అప్ డేట్ రాలేదు. పవన్ సన్నిహితులు, పవన్ కు చికిత్స చేసిన వైద్యులు పవన్ ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!