Adipurush: ఆదిపురుష్ మూవీ ఫలితాన్ని వాళ్లు ముందుగానే ఊహించారా?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితాన్ని మేకర్స్ ముందుగానే ఊహించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మూవీ ఫలితం వాళ్లకు ముందే తెలియడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రమోషన్స్ ఆపేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎంత పెద్ద సినిమాకు అయినా ప్రస్తుత కాలంలో భారీ రేంజ్ లో ప్రమోషన్స్ అవసరమని చెప్పవచ్చు.

అయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒకింత నిర్లక్ష్యంగానే వ్యవహరించడం జరిగింది. ఆదిపురుష్ మొదటిరోజు బాగానే కలెక్షన్లను సొంతం చేసుకోగా రెండో రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లలో కొంతమేర డ్రాప్ కనిపించింది. వీకెండ్ కావడంతో ఆదివారం కూడా ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో సమస్య లేదని సమాచారం అందుతోంది. రెండో రోజు టెస్ట్ లో ఈ సినిమా పాసైందని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఈ సినిమాకు 17 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. ప్రభాస్ రాముని పాత్రలో నటించడం, త్రీడీ షాట్స్ ఉండటంతో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం రోజు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రం ఆదిపురుష్ మూవీకి తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సంచలనాలను సృష్టించాలని ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus