Mahesh Babu shirt cost: గుంటూరు కారంలో మహేష్ ధరించిన షర్ట్ ధర తెలిస్తే మతిపోతుంది..!

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించారు. ఇక ఈ పోస్టర్లో మహేష్ బాబు వేసుకున్నటువంటి షర్ట్ ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు ఆర్‌13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్‌ లో మ‌హేష్ బాబు కనిపించారు.

అయితే ప్రస్తుతం టీషర్ట్స్ మార్కెట్లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఏకంగా ఒక షర్ట్ కొంటే మరొక షర్ట్ అంటూ భారీ ఆఫర్స్ తో మార్కెట్లోకి వచ్చాయి. సాధారణంగా ఒక హీరో ఏదైనా షర్ట్ వేసుకున్న లేదా వాచ్ కట్టుకున్న అలాంటివి వేసుకోవాలని అభిమానులు కూడా భావిస్తారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్స్ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే అభిమానులు స‌ర‌దాగా ఈ ష‌ర్ట్ కాస్ట్ ను గూగుల్ సెర్చ్ చేయ‌గా..

వారికి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డింది. ఎందుకంటే, గుంటూరు కారం లేటెస్ట్ పోస్ట‌ర్ లో మ‌హేష్ బాబు ధ‌రించిన ష‌ర్ట్ ధ‌ర అక్ష‌రాల రూ. 74,509. ఈ విష‌యం తెలిసి మ‌హేష్ రేంజ్ కు ఏ మాత్రం ఉండాల‌ని అభిమానులు అంటుంటే. నెటిజ‌న్లు మాత్రం ఆ రేటుకి కోటీలో అలాంటి ష‌ర్ట్ లు డ‌బ్బైకి పైగా వ‌స్తాయ‌ని సెటైర్లు పేలుస్తున్నారు.

మొత్తానికి (Mahesh Babu) మ‌హేష్ షార్ట్ కాస్ట్ మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాగా, గుంటూరు కారం అనంత‌రం మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus