Hyper Aadhi: హైపర్ ఆది నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దొరబాబు భార్య అమూల్య..!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వరుసగా టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా వీళ్ళు అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో ముందుంటాడు మన హైపర్ ఆది. ఇతని స్కిట్ నిండా నాన్ స్టాప్ పంచ్ లు ఉంటాయి. అందుకే యూట్యూబ్ లో ఆది స్కిట్లకు లక్షల్లో వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. నెటిజన్లు కూడా ఎవరినైనా ట్రోల్ చెయ్యాలి అనుకుంటే ఆది స్కిట్లలో డైలాగులనే వాడుకుంటూ ఉంటారు.

నిజ జీవితంలో ఒక్కొక్కరి స్వభావాన్ని.. ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ పంచ్ లు వేస్తుంటాడు ఆది. అలాంటి ఆది స్వభావం ఎలాంటిదో తాజాగా బయటపెట్టింది దొరబాబు భార్య అమూల్య. ఇటీవల ఓ షోకి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన అమూల్య.. ఆదిని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేసింది. సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోకి గెస్ట్ గా హాజరైన అమూల్య.. ఈ విధంగా స్పందించింది. ‘అసలు దొరబాబు ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్?’ అని సుధీర్.. అమూల్యను ప్రశ్నించగా..

‘నన్ను దొరలాంటోడిని పెళ్లి చేసుకోమని మా ఇంట్లో మొదటి నుండీ చెబుతుండేవారు.. అందుకే ఏకంగా దొరబాబునే పెళ్లి చేసుకున్నాను’ అంటూ సమాధానం ఇచ్చింది అమూల్య. ‘ఇందుకే నీకు అంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు’ అంటూ పక్కనే ఉన్న ఆది కౌంటర్ వేసాడు. ఆ టైములో అమూల్య అతని గురించి మాట్లాడుతూ..’నేను,దొరబాబు కష్టాల్లో ఉన్న టైములో..ఆదినే మాకు అండగా నిలబడ్డాడు.అందుకే మా ఫోన్లో ఆది పేరు ‘గాడ్’ అని ఫీడ్ చేసుకున్నాం.నిజంగా ఆది దేవుడులాంటోడే ‘ అంటూ కామెంట్ చేసింది అమూల్య.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus