Bigg Boss 5 Telugu: ప్రియా విషయంలో రవి నిజంగానే ప్లేట్ మార్చాడా..?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ అనేవి హీటెక్కిపోయాయి. సెకండ్ వీక్ కంటే కూడా భయంకరమైన ఆర్గ్యూమెంట్స్ తో హౌస్ మోత మోగిపోయింది. ముఖ్యంగా ప్రియ లహరి అండ్ రవిల మిడ్ నైట్ హగ్ గురించి చెప్తూ లహరిని నామినేట్ చేసింది. దీంతో లహరికి రవికి ఇద్దరికీ బాగా మండింది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ రెచ్చిపోయారు. అంతేకాదు, ప్రియా లహరిని ఉద్దేశ్యించి నువ్వు హౌస్ లో వేనే మెన్స్ తో ( అబ్బాయిలతో ) బిజీగా ఉన్నావ్, అందుకే నాకు టైమ్ ఇవ్వట్లేదు అంటూ మాట్లాడింది. దీనికి లహరి కౌంటర్ ఎటాక్ చేసింది.

నామినేషన్స్ అయిపోయిన తర్వాత లహరి కి ప్రియాంక అసలు విషయాన్ని చెప్పింది. నిజానికి రవి హగ్ ఇచ్చిన రోజు తెల్లారి బెడ్ దగ్గర ప్రియతో తన బాధని పంచుకున్నాడు. వస్తోంది.. నా పనులు చేస్తోంది. నాతో కలిసి తింటోంది. బ్యాటరీస్ మారుస్తోంది. హౌస్ లో సింగిల్ మన్స్ ఇంతమంది ఉండగా నేను చెప్పలేకపోతున్నా అంటూ ప్రియతో మాట్లాడాడు. అలాగే, హర్ట్ అవ్వకుండా చెప్పాలి. అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత యాంకరింగ్ కోసం ట్రై చేస్తోందని, అందుకే నాతోనే ఉంటోందని అందుకే కలిసి నాపనులు చేస్తోందని చెప్పాడు రవి. ఇదే విషయాన్ని ప్రియాంక లహరితో చెప్పింది. ఇక లహరి స్ట్రయిట్ గా రవిని ఈ క్వశ్చన్ అడిగింది. రవిని నిలదీసింది. నువ్వు ప్రియతో ఈమాటలు అన్నావట నిజమేనా అని అడిగింది.

దీనికి రవి అబ్బే.. అస్సలు నేను ఈమాటే అనలేదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని ప్రియ దగ్గర క్లారిటీ తీస్కునేందుకు వెళ్లారు. అక్కడ మానస్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఇక్కడే ప్రియా సింగల్ మాన్ ని వదిలేసి నాతో ఉంటోందని నువ్వు అన్నావ్ బ్రో అని చెప్పింది. అసలు సింగిల్ మాన్ అనే మాటే రాలేదక్కా.. అంటూ రవి అనేసరికి బాధపడింది ప్రియ. నిజంగా నువ్వు ఆ మాట అన్నావ్ బ్రో అంటూ ఏడ్చేసింది ప్రియ. నిజానికి రవి ఈమాటలని ప్రియతో డిస్కషన్ చేశాడు. కానీ , ఇప్పుడు అనలేదు అంటూ లహరి ముందు ప్లేట్ ఫిరాయించాడు. మరి ఈ ఇష్యూ ఇంతటితో ఆగుతుందా.. వీకండ్ నాగార్జున దీనిపై క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus