‘జెర్సీ’ తరువాత నాని చేసిన ‘గ్యాంగ్ లీడర్’ ‘వి’ చిత్రాలు నిరాశపరిచాయి. అంతకు ముందు కూడా అతను చేసిన ‘జెర్సీ’ తప్ప ‘దేవదాస్’ ‘కృష్ణార్జున యుద్ధం’ ఫలితాలు కూడా తేడా కొట్టాయి. సో గత ఐదు సినిమాల్లో నానికి ఒక ‘జెర్సీ’ మాత్రమే హిట్ ఉంది. అది కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు అనే కంప్లైంట్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్ట్రాంగ్ హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని నాని భావిస్తున్నాడు. అందుకు తగినట్టే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం నాని.. శివ నిర్వాణ డైరెక్షన్లో ‘టక్ జగదీష్’ అలాగే ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి సక్సెస్ ఫుల్ బ్యానర్లో ‘అంటే సుందరానికి’ అనే చిత్రం కూడా చెయ్యబోతున్నాడు. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా రాకపోయి ఉంటే కనుక గతేడాదే నాని సినిమాలు రెండు విడుదలయ్యి ఉండేవి..!
కానీ ప్లానింగ్ అంతా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ‘టక్ జగదీష్’ చిత్రం సమ్మర్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం ఈ ఏడాది ఎండింగ్ లోపు విడుదల కాబోతుంది. కాబట్టి ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను ఫిబ్రవరి 24న ప్లాన్ చేసాడట నాని. ఆరోజు నాని పుట్టినరోజు కావడంతో అభిమానులను నాని ఖుషీ చేయించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?