Chiranjeevi: చిరంజీవికి ఇష్టమైన నటి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 150కు పైగా సినిమాలలో నటించి మెగాస్టార్ గా చిరంజీవి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ అయినా బాల్యంలో చిరంజీవి సైకిల్ పై తిరిగేవారంటూ చిరంజీవి స్నేహితులలో ఒకరైన డాక్టర్ సత్యప్రసాద్ చిరంజీవికి సంబంధించిన రహస్యాలను వెల్లడించారు. భీమవరంలో ప్రస్తుతం హాస్పిటల్ ను నడుపుతున్న సత్యప్రసాద్ చిరంజీవితో కలిసి చదివిన రోజులను ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పని చేసేవారని అందువల్ల చిరంజీవిని అమ్మమ్మ గారి ఊరైన మొగల్తూరులో ఉంచి చిరంజీవి తండ్రి చదివించేవారని సత్యప్రసాద్ తెలిపారు.

ఏడో తరగతి నుంచి ఇప్పటికీ చిరంజీవి తనకు మంచి స్నేహితుడని చిరంజీవి తండ్రికి కూడా తానంటే ఎంతో ఇష్టమని సత్యప్రసాద్ చెప్పుకొచ్చారు. పదో తరగతిలోనే చిరంజీవికి దాదాపు 10 నుంచి 15 ప్రేమ లేఖలు వచ్చేవని ఆ లవ్ లెటర్స్ ను చూసి తాను, చిరంజీవి నవ్వుకునే వాళ్లమని సత్యప్రసాద్ అన్నారు. పదో తరగతిలోనే చిరంజీవి చాలా స్టైల్ గా ఉండేవారని ఎన్ని ప్రేమ లేఖలు వచ్చినా లవ్ లెటర్ రాసిన అమ్మాయిల దగ్గరకు వెళ్లి ఎందుకు రాశారని చిరంజీవి ఎప్పుడూ అడగలేదని సత్యప్రసాద్ అన్నారు.

సున్నితమైన మనస్సు ఉన్న ఆడపిల్లలు అలా అడిగితే బాధ పడతారని చిరంజీవి గొప్పగా ఆలోచించేవారని సత్యప్రసాద్ వెల్లడించారు. స్కూల్ లో చిరంజీవి ఎప్పుడూ అల్లరి చేష్టలు చేస్తూ ఉండేవారని సావిత్రి చిరంజీవికి ఇష్టమైన నటి అని సత్యప్రసాద్ తెలిపారు.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus