Drishyam 2 Collections: ఎంతోమంది స్టార్ల వల్ల కానిది.. అజయ్‌ దేవగణ్‌ వల్ల అయ్యిందిగా!

బాలీవుడ్‌కి అర్జెంట్‌గా హిట్‌ కావలెను.. గత కొద్ది నెలల నుండి ఈ మాట మనం వింటూనే ఉన్నాం. అలా అని బాలీవుడ్‌లో హిట్లు లేవా అంటే ఉన్నాయి. అయితే పాన్‌ ఇండియా సినిమాలుగా సౌత్‌లో రూపొంది అక్కడికి వెళ్లి హిట్ అయినవి. దీంతో సౌత్‌ సినిమాలే తోపు అని మన వాళ్లు జబ్బలు చరుచుకుంటున్నారు. ఈ క్రమంలో మన కథలు రీమేక్‌లు అయ్యి అక్కడికి వెళ్లాయి. కానీ అవి కూడా తుస్‌ మంటున్నాయి. అయితే ఇప్పుడు ఓ రీమేక్‌ సినిమా బాలీవుడ్‌ కరవు తీరుస్తోంది. అదే ‘దృశ్యం 2’.

అజయ్‌ దేవగణ్‌, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమది. మలయాళంలో చిన్న సినిమాగా రూపొందిన ‘దృశ్యం’ మొత్తం దేశమంతా రీమేక్‌ అవుతూ సంచలనంగా మారింది. ఆ తర్వాత దీని సీక్వెల్‌కి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పుడు ఉన్న జోరు కొనసాగితే పెద్ద నెంబర్లే నమోదవుతాయని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ పాఠ‌క్ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ ‘దృశ్యం 2’ చేశారు. మలయాళ ‘దృశ్యం 2’తో పోలిస్తే కొన్ని మార్పులు కూడా ఈ సినిమాలో చేశారు.

ఇప్పుడు ఈ సినిమా అదరగొడుతోంది. ఏకంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది. దృశ్యం 2’ ఇప్పటికే మలయాళ, తెలుగు వెర్షన్లు ఓటీటీలో అందుబాటులో ఉంటంతో ఈ సినిమాను హిందీ జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారా అనే డౌట్స్‌ మధ్యలో హిందీ ‘దృశ్యం 2’ విడుదలైంది. అనుమానాల్ని పంటాపంచలు చేస్తూ.. బాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో వసూళ్ల సంగతి నాకొదిలేయ్‌.. అంటూ రూ. 200 కోట్లు తీసుకొచ్చింది. అలా మోహన్ లాల్, వెంకటేష్ ఏం మిస్ చేసుకున్నారో హిందీ ‘దృశ్యం 2’ చూపిస్తోంది.

అదేంటీ అనుకుంటున్నారా? ఇంకేంటి వసూళ్లు. మలయాళంలో మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేశ్‌ ఈ సినిమాలను ఓటీటీకి ఇచ్చేశారు. దీంతో డబ్బులు అయితే వచ్చాయి కానీ.. ఈ స్థాయిలో రాలేదు. దీంతో కొంతమంది అలా అంటున్నారు. మలయాళంలో త్వరలో ‘దృశ్యం 3’ మొదలవుతోంది. కాబట్టి అజయ్‌ దేవగణ్‌ రెడీ అయిపోవచ్చు. చాలా రోజులుగా బాలీవుడ్‌ స్టార్లు, స్టార్‌ హీరోయిన్లు ఎంత ప్రయత్నించినా రాని భారీ వసూళ్లు అజయ్‌ తీసుకొచ్చాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus