Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 21, 2026 / 01:45 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ లాల్ (Hero)
  • మీనా (Heroine)
  • అన్సీబ హాసన్, సిద్దిఖీ,ఎస్తేర్ అనిల్, ఆశా శరత్ తదితరులు (Cast)
  • జీతూ జోసెఫ్ (Director)
  • అంటోనీ పెరంబవూర్ (Producer)
  • అనిల్ జాన్సన్ (Music)
  • సతీష్ కురుప్ (Cinematography)
  • వినాయక్ వి ఎస్ (Editor)
  • Release Date : 21st మే 2026
  • ఆశీర్వాద్ సినిమాస్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ (Banner)

మలయాళంలో సూపర్ హిట్ అయితే ‘దృశ్యం’ ‘దృశ్యం 2’ చిత్రాలను తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కోవిడ్ పరిస్థితుల కారణంగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అది కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం 3’ (Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈసారి తెలుగులో రీమేక్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ ని డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. మరి ఈ మూడో భాగం కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా? తెలుసుకుందాం రండి :

Drishyam 3 Movie Review

Drishyam 3 Movie Review And Rating

కథ: జార్జ్(Mohanlal) గతాన్ని మర్చిపోయి తన ఫ్యామిలీతో సాధారణ జీవితనాన్ని జీవిస్తుంటాడు. ఇందులో భాగంగా అతను నిర్మాతగా మారి ‘దృశ్యం’ అనే సినిమాని నిర్మిస్తాడు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల స్పూర్తితో జార్జ్ ఆ చిత్రాన్ని మలయాళంలో ఓ పెద్ద స్టార్ హీరోతో తెరకెక్కిస్తాడు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. జార్జ్ పేరు దేశమంతా మార్మోగుతుంది. అయితే కొడుకుని పోగొట్టుకుని ఆ బాధని భరించలేక విదేశాలకి వెళ్లి సెటిల్ అయిన గీత(ఆశ శరత్) ప్రభాకర్(సిద్దిఖీ) మాత్రం జార్జ్ సంతోషమైన జీవితాన్ని చూసి తట్టుకోలేకపోతారు. ఈ క్రమంలో గీత డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. మరోవైపు పెద్ద కూతురు అంజుకి(అన్సిబా హాసన్) పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు జార్జ్, రాణి(మీనా).

కానీ అంజు మానసిక పరిస్థితి అలాగే ఫ్యామిలీపై మర్డర్ కేసు కోర్టులో ఉండటంతో ఆమెకు సంబంధాలు కుదరవు. విదేశీ సంబందాలకి జార్జ్ ఒప్పుకోడు. అయితే భార్య, చిన్న కూతురు అను(ఎస్తేర్ అనిల్) బలవంతంతో ఓ ఎన్నారై సంబంధానికి అంగీకరిస్తాడు. పెళ్లి చేసి కూతుర్ని విదేశాలకి పంపించేద్దాం అనుకునే టైంలో వరుణ్ ఫ్యామిలీ మళ్ళీ జార్జ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. వారి వల్ల మళ్ళీ జార్జ్ కి అతని కుటుంబానికి వచ్చిన సమస్యలు ఏంటి? సహదేవ్(కళాభవన్ షాజోన్) మళ్ళీ జార్జ్ జీవితంలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? చివరికి వీళ్ళ బారి నుండీ జార్జ్ కుటుంబం ఎలా తప్పించుకుంది? అనేది మిగిలిన కథ.

Drishyam 3 Movie Review And Rating

నటీనటుల పనితీరు: తెలుగు ‘దృశ్యం’కి(సిరీస్) అలవాటు పడినవారికి ‘దృశ్యం 3’ క్యారెక్టర్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. వాటిపై క్లారిటీ వచ్చేసరికి సగం సినిమా అయిపోతుంది. జార్జ్( తెలుగులో రాంబాబు) పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలానే హుందాగా కనిపించాడు. మొదటి రెండు భాగాలతో పోలిస్తే.. ఇందులో అతనికి నటించే స్కోప్ అయితే ఎక్కువ లేదనే చెప్పాలి. రాణి(జ్యోతి తెలుగులో) పాత్రలో మీనా బాగానే చేసింది. గీత పాత్ర పోషించిన ఆశా శరత్ ని ఓ మూలన కూర్చోబెట్టారు. మొదటి రెండు పార్టుల్లో అగ్రెసివ్ గా కనిపించిన గీత పాత్రని ఇందులో సైడ్ చేయడం అనేది ఒక డిజప్పాయింట్మెంట్. ఊహించని విధంగా ప్రభాకర్(సిద్దిఖీ) పాత్రని అంటే తెలుగులో నరేష్ పోషించిన పాత్ర అనమాట. ఇందులో ఆ పాత్రని కాస్త క్రూయల్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకో అది సెట్ అవ్వలేదు. సహదేవ్(కళాభవన్ షాజాన్) అంటే మొదటి భాగంలో కనిపించిన కానిస్టేబుల్ వీరభద్రం పాత్రని ఇందులోకి మళ్ళీ తీసుకొచ్చారు. అతని విలనిజం సినిమాకి హైలెట్ అయ్యింది. కానీ జర్నలిస్ట్ అయినటువంటి అతని కూతురు పాత్రని సైడ్ చేసిన విధానం మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. మిగతా నటీనటుల పాత్రలకి సరైన అర్క్స్ లేకపోవడం కూడా మైనస్ గా చెప్పుకోవాలి.

Drishyam 3 Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘దృశ్యం 3’ ని నేరుగా తెలుగులోకి డబ్ చేయడం వల్ల..ఇక్కడి ప్రేక్షకులకు కొంత క్లారిటీ మిస్ అయ్యింది అనే చెప్పాలి. ఒరిజినల్లోని పాత్రలన్నిటినీ రిలేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కనీసం తెలుగు ప్రేక్షకులకి అలవాటైన రాంబాబు, వీరభద్రం వంటి పాత్రల పేర్లయినా పెట్టేసి ఉండాల్సింది. అప్పుడు ఆడియన్స్ అంత కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కాదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ టేకింగ్ ను తలపిస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటనేది క్లారిటీ రాకుండానే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. పోనీ సెకండాఫ్ నుండీ అయినా కాన్ఫ్లిక్ట్ పాయింట్ పై క్లారిటీ ఇచ్చారా అంటే అదీ లేదు. ప్రీ క్లైమాక్స్ వరకు కథ, కాన్ఫ్లిక్ట్ పాయింట్ పై ప్రేక్షకులకు ఒక క్లారిటీ రాదు. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులన్నీ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. సినిమాకి ఇచ్చిన కన్క్లూజన్ కూడా కన్వెన్సింగ్ గా అనిపించదు. ‘దృశ్యం’ ‘దృశ్యం 2’ సినిమాల్లో హీరో ఆడే మైండ్ గేమ్స్..తో క్లైమాక్స్ లో ట్విస్టులు ఉంటాయి. అవి కథలో భాగంగా ఉంటాయి.. అలాగే ప్రతి పాత్రని ఆ ట్విస్టులకి రిలేట్ చేసిన విధానం కూడా ఆడియన్స్ ని ఎక్సయిట్ అయ్యేలా చేస్తాయి.

కానీ ‘దృశ్యం 3’ లో ట్విస్టులు అలా అనిపించవు. ‘ఈ మాత్రం దానికి అంత అవసరమా?’ అనేలా ఉంటాయి. కొన్ని పాత్రలకి దర్శకుడు సరైన కన్క్లూజన్ ఇవ్వలేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వాటికి సరైన ఆర్క్స్ కూడా ఉండవు.దర్శకుడు జీతూ జోసెఫ్ 4 ట్విస్టులు రాసుకుని ‘దృశ్యం 3’ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోయినట్టు ఉన్నాడు. పైగా క్లైమాక్స్ లో గీత పాత్రతో బలవంతంగా ‘దృశ్యం 4’ కి లీడ్ ఇచ్చాడు….అది కూడా ఎక్సయిటింగ్ గా అనిపించదు. ఈ మైనస్సులన్నీ పక్కన పెడితే.. టెక్నికల్ వర్క్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ క్వాలిటీ అన్నీ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ డిజైన్ కథకి తగ్గట్టు ఉంది.

Drishyam 3 Movie Review And Rating

విశ్లేషణ: ‘దృశ్యం 3’ వస్తుంది అనే ప్రకటన వచ్చినప్పుడు.. ‘వెంకటేష్ మంచి సీక్వెల్ ను మిస్ చేసుకున్నాడు’ అని చాలా మంది కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లంతా ‘దృశ్యం 3’ చూశాక ‘వెంకటేష్ డెసిషన్ సరైనదే’ అని ఫీల్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. థియేటర్లలో ఎగబడి చూసేంతలా ఈ ‘దృశ్యం 3’ లో ఏమీ లేదు. కాబట్టి ఓటీటీకి వచ్చాక చూసుకోవడం బెటర్.

Drishyam 3 Movie Review And Rating

ఫోకస్ పాయింట్: సీరియల్ టేకింగ్ తో బోర్ కొట్టించిన సూపర్ హిట్ సీక్వెల్

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam 3 Movie
  • #Esther Anil
  • #Jeethu Joseph
  • #Meena
  • #Mohanlal

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

46 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version