Drushyam 2 Trailer: ఆకట్టుకుంటున్న వెంకటేష్ ‘దృశ్యం2’ ట్రైలర్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం2’ కూడా రూపొందింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ లానే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోనే రిలీజ్ అవుతుంది.నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మాక్స్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి.

ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ‘దృశ్యం’ లో వెంకటష్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా కనిపిస్తే ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు నిర్మాతగా కూడా మారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే వరుణ్ తల్లి గీతా ప్రభాకర్.. రాంబాబు ఫ్యామిలీ పై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ వారిని స్టేషన్లో పెట్టి చిత్ర హింసలు చేస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి.

అసలు పోలీసులకి ఏ క్లూ దొరకడం వలన రాంబాబు ఫ్యామిలీని అరెస్ట్ చేశారు..? చివరికి రాంబాబు ఫ్యామిలీ ఎలా బయటపడింది? అనే విషయాలను సస్పెన్స్ గా ఉంచుతూ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. నవంబర్ 25 కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus