దేవిశ్రీ నుంచి వస్తున్న దుమ్మురేపే సాంగ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య సీరిస్ తర్వాత చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ సినిమాకి. అంతేకాదు, ఆర్య – ఆర్య 2 సినిమాలకి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్పకి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడా.. ఎలాంటి ఆల్బమ్ ని క్రియేట్ చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ టైమ్ లో దేవిశ్రీ ప్రసాద్ అతి త్వరలోనే పుష్పకి సంబంధించిన అద్దిరిపోయే సాంగ్ ని విడుదల చేయబోతున్నాడు. మార్చిలో 11వ తేదిన శివరాత్రి సందర్భంగా ఈసాంగ్ ని రిలీజ్ చేయాలని దేవిశ్రీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇది రీసంట్ గా షూటింగ్ చేసిన ఇంట్రడక్షన్ సాంగ్ ని ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారట. పుష్ప ఇంట్రో సాంగ్ గా ఇది రాబోతోందని అంటున్నారు. మాస్ బీట్ తో దుమ్మురేపే సాంగ్ ఫ్యాన్స్ కోసం ఇవ్వబోతున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప బజ్ క్రియేట్ అయ్యింది. ఎలాంటి అప్ డేట్ వచ్చినా సెకన్స్ లో వైరల్ అవుతోంది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ దుమ్మురేపడం పక్కా అనిపిస్తోంది. అంతేకాదు, శిష్యుడు బుచ్చిబాబుకి నీ కన్ను నీలి సముద్రం అంటూ అద్దిరిపోయే ట్యూన్ తో సాంగ్ ఇస్తే, గురువుగారు సుకుమార్ కి పుష్ప ఇంట్రో సాంగ్ ఏ లెవల్లో ఇస్తాడో అని ఫ్యాన్స్ దేవిశ్రీ ఇచ్చే సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus