Diwali Movies: ఫెస్టివల్‌ సీజన్‌ను టాలీవుడ్‌ ఇలా గాలికొదిలేసింది ఏంటి?

  • October 30, 2023 / 02:04 PM IST

టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌ డేట్‌లు, రిలీజ్‌ల కోసం పడే కష్టాలు చూస్తుంటే… ‘అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి’ అనిపిస్తుంటుంది. ఇదేదో ఒక సీజన్‌లో సినిమాల గురించి చూసి అనేసిన మాటకాదు. గత కొన్నేళ్లుగా చూస్తే ఇలానే అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకే సినిమా డేట్‌ కోసం పడీపడీ మరి రిలీజ్‌ చేస్తుంటారు. ఇంకోసారి మొత్తంగా ఓ డేట్‌ను లైట్‌ తీసుకుంటారు. దాని వెనుక వారి కారణాలు వారికి ఉండొచ్చు.. కానీ ఎందుకు ఇలా ఓ వీకెండ్‌ వదిలేయడం అనే మాట మాత్రం వినిపిస్తుంది.

కావాలంటే మీరే చూడండి… తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్‌ బెస్ట్‌ ఫెస్టివల్‌ సీజన్‌ అయిన దీపావళిని మొత్తంగా డబ్బింగ్‌ సినిమాలకు వదిలేశారు. సంక్రాంతి, దసరా పండగల రేంజిలో దీపావళికి తెలుగు సినిమా మార్కెట్‌లో మైలేజ్ పెద్దగా ఉండదు. అయితే మరీ కొట్టిపడేసేంత తక్కువ అయితే కాదు. ఈ కారణంగా నిర్మాతలు ఈ సీజన్‌ను లైట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఏడాది కూడా లైట్‌ తీసుకున్నారు అని చెప్పాలి. అందుకే నవంబరు రెండో వారానికి డబ్బింగ్‌ సినిమాలకు వదిలేశారు.

నవంబర్ 12న సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ రిలీజ్‌ అవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న హిందీ డబ్బింగ్‌ మూవీ ఇది. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్’, ‘జవాన్’ తెలుగు వెర్షన్ల వసూళ్ల స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు సంపాదించే పనిలో సినిమా టీమ్‌ ఉంది. ఇక కార్తి తమిళ సినిమా ‘జపాన్’ అదే పేరుతో తెలుగులో నవంబరు 10న వస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది.

ఇక లారెన్స్ – ఎస్‌జే సూర్య ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమాను (Diwali Movies) దీపావళి డేట్‌కే తీసుకొస్తారట. అలాగే ఓ వారం తర్వాత ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ వస్తుంది. అలా వచ్చే పటాకుల ఫెస్టివల్‌కు మొత్తంగా టాలీవుడ్‌లో డబ్బింగ్‌ టపాసులే పేలబోతున్నాయి. ఏవి తుస్‌ మంటాయో, ఏవి బుస్‌ మంటాయో చూడాలి. అన్నట్లు అదే సమయంలో వైష్ణవ్‌తేజ్‌ ‘ఆదికేశవ’, ‘మంగళవారం’ కూడా ఉన్నాయి కానీ… అంత బజ్‌ అయితే లేదు అని ఇండస్ట్రీ టాక్‌.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus