కోలీవుడ్ హీరో, దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ దీపావళికి ‘డ్యూడ్’ (Dude) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్టోబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ ను దర్శకుడు కీర్తీశ్వరన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని, అప్పుడెప్పుడో వచ్చిన ‘కన్యాదానం’ లైన్ ను తీసుకుని చాలా వల్గర్ గా తెరకెక్కించాడని సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు.
‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఖర్చుకి వెనకాడకుండా నిర్మించింది. వాళ్ళు ప్రమోషన్స్ గట్టిగా చేసి మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలిగారు. కానీ బ్రేక్ ఈవెన్ అయితే కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సెలవులు ముగిసిన తర్వాత ‘డ్యూడ్’ కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి.

ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 4.14 cr |
| సీడెడ్ | 0.82 cr |
| ఆంధ్ర(టోటల్) | 3.56 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.52 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.38 cr |
| ఓవర్సీస్ | 0.64 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 9.54 కోట్లు(షేర్) |
‘డ్యూడ్’ (Dude) చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9.54 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.15.30 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.46 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
