Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..
- February 23, 2026 / 01:45 PM ISTByFilmy Focus Desk
సినిమా ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు, కథను హీరో పూర్తిగా వినలేదు, అయినా సరే 300 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయన్న అంచనాలు ఇప్పటికే కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ స్థాయి బజ్ రావడానికి కారణం..యూత్ ఆడియన్స్ ను తన సినిమాలతో బలంగా ఆకట్టుకుంటున్న డైరెక్టర్ అండ్ హీరో ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఈ యువ సంచలనం ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న సెలెబ్రెటీగా మారిపోయాడు.
Kollywood movie
ప్రదీప్ డైరెక్షన్ చేస్తూ హీరోగా తెరకెక్క్కిన చిత్రం ‘లవ్ టుడే’ యువతలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన మూవీ ‘డ్రాగన్’ అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బ్లాక్‌బస్టర్‌గా మారి, దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలతో ప్రదీప్ తమిళనాడులో మాత్రమే కాక తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇప్పుడు అదే డ్రాగన్ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దర్శకుడు అస్వత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ఈ కథను మరింత విస్తరించే ఆలోచన ఉంది. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు రెడీ అయింది” అంటూ క్లారిటీ ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల విడుదలైన ‘డ్యూడ్’ విజయం కూడా ఈ హైప్‌కు బలం చేకూరుస్తోంది. డైరెక్టర్ అంచనా ప్రకారం, ఈసారి స్టోరీ మరింత పవర్‌ఫుల్‌గా ఉండటంతో 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా తర్వాత ప్రదీప్ తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, స్క్రిప్ట్ దశలోనే ఇంత క్రేజ్ అంటే ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ ఎంత వేగంగా పెరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది.















