బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం నటరాజ్ మాస్టర్ హైలెట్ అవుతూనే వచ్చారు. నామినేషన్స్ అప్పుడు బిందుకి, అలాగే బాబాభాస్కర్ కి ఎదురుతిరిగారు. తనదైన స్టైల్లో మాటలు విసురుతూ రెచ్చిపోయారు. దీంతో హౌస్ మేట్స్ నటరాజ్ మాస్టర్ ని లైట్ తీస్కున్నారు. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంటారు కదా అని పట్టించుకోలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులకి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడుతూ ఓట్ అప్పీల్ చేసుకునే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ఫ్లవర్స్ ని కలక్ట్ చేసి తోటని నిర్మించాల్సి ఉంటుంది.
ఎవరైతే ఎక్కువ పూలని కలక్ట్ చేస్తారో వారికి ఓటు అప్పీల్ చేసుకునే అర్హత లభిస్తుంది. అలాగే, గేమ్ లో నుంచీ వైదొలిగిన సభ్యులు వేరేవాళ్లకి సపోర్ట్ చేయచ్చు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గేమ్ చివర్లోకి వచ్చేసరికి అనిల్ ఇంకా నటరాజ్ మాస్టర్ , అఖిల్ మాత్రమే మిగిలారు. అకిల్ దగ్గర తక్కువ పూలు ఉన్నాయి. దీంతో నటరాజ్ మాస్టర్ నువ్వు ఎలిమినేట్ అవుతున్నావ్ కదా, నాకు సపోర్ట్ చేయమని అడిగాడు.
కానీ, అఖిల్ తన టీమ్ లో ఉన్న అనిల్ కి లాస్ట్ టైమ్ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు పే బ్యాక్ చేసే టైమ్ వచ్చిందని చెప్పాడు. అందుకే అనిల్ కి సపోర్ట్ చేశాడు. దీంతో మాస్టర్ కి మండింది. టాస్క్ లో ఓడిపోయే సరికి బరెస్ట్ అయిపోయారు. టాస్క్ అయిపోయిన తర్వాత దేవుడితో మాట్లాడుతూ పైకి చూస్తూ మనసులో ఉన్న ఆవేదనని అంతా చెప్పుకున్నారు. నాకు హౌస్ మేట్స్ సపోర్ట్ ఫస్ట్ నుంచీ లేదని, కనీసం ఆడియన్స్ తో మొరపెట్టుకుందామన్నా కూడా లేకుండా చేశావ్ అంటూ రెచ్చిపోయి మరీ అరుస్తూ మాట్లాడారు.
దీంతో హౌస్ మేట్స్ అంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. హౌస్ లో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని, అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ సపోర్ట్ ఉందని కానీ, నాకు మాత్రమే లేదని వాపోయారు. టాప్ 5లోకి వెళ్లకపోతే వేస్ట్ అని, నన్ను చంపేయ్ అంటూ దేవుడితో మాట్లాడుతూ బరెస్ట్ అయిపోయారు. ఇక్కడే అఖిల్ వచ్చి మాస్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నువ్వు మోసం చేశావని నాకు చాలాసార్లు నేను హెల్ప్ చేశానని అఖిల్ తో అన్నారు మాస్టర్.
దీంతో అఖిల్ నాకు ఎవరికి సపోర్ట్ చేయాలనిపిస్తే వాళ్లకే చేస్తానని, ఇది నా గేమ్ అంటూ మాట్లాడాడు. నటరాజ్ మాస్టర్ ఇలా బాధపడుతుంటే హౌస్ మేట్స్ చూడలేకపోయారు. అరియానా వచ్చి వారించింది. మాస్టర్ మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పింది. లాజికల్ గా మాట్లాడుతూ మాస్టర్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. నటరాజ్ మాస్టర్ కాలు నొప్పి పుడుతున్నా కూడా గేమ్ ఆడుతున్నాను అని, నా బిడ్డకోసమే రెక్కలు ముక్కలు చేసుకుని ఆడుతున్నాననంటూ చెప్పుకొచ్చాడు. బాబాభాస్కర్, మిత్రా, అరియానా వారిస్తున్నా కూడా వినిపించుకోలేదు.