Bigg Boss 7 Telugu: శోభా చెప్పిన విషయం వల్లే గొడవ అయ్యిందా? అమర్ చెప్పబోయే ఆ సీక్రెట్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే కని వినీ ఎరుగని గొడవ జరిగింది. ఫన్ టాస్క్ ఆడుకోమని బిగ్ బాస్ అంటే, చేతులు కొరికేవరకూ వెళ్లారు పార్టిసిపెంట్స్. అమర్ ప్రశాంత్ చేయి కొరికిందే కాకుండా, అది పెద్ద విషయమే కాదు, పదా మెడికల్ రూమ్ కి వెళ్దాం అంటూ నెట్టుకుంటూ తీస్కుని వెళ్లాడు. ఇప్పుడు ఇది బిగ్ బాస్ ఆడియన్స్ కి తీవ్రమైన ఆగ్రహం తెప్పిస్తోంది. సీరియల్ బ్యాచ్ వరెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టాస్క్ లో ఏం జరిగింది. శోభాశెట్టి వల్లే అమర్ ఫ్రస్టేట్ అయ్యాడా ? ఈవిషయాలు ఒక్కసారి చూసినట్లయితే.,

బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 7 Telugu) లో గత కొన్ని రోజులుగా స్పై బ్యాచ్ కి స్పా బ్యాచ్ కి వర్క్ విషయంలో ఈగో క్లాషెష్ వస్తున్నాయి. అమర్ కెప్టెన్ గా రాయభారిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. అటు వాళ్లకి, ఇటు వీళ్లకి చెప్పలేక సతమతమవుతున్నాడు. ముఖ్యంగా అంట్లు తోమడం, చపాతీలు చేయడం, క్లీనింగ్ చేయడం ఇలా అన్ని విషయాల్లో క్లాషెష్ వస్తున్నాయి. అయినా కూడా ఇల్లు గడిచిపోతోంది. ఈనేపథ్యంలో అమర్ మైండ్ లో శోభాశెట్టి పదే పదే పల్లవి ప్రశాంత్ యాక్ట్ చేస్తున్నాడని చెప్పడం స్టార్ట్ చేసింది.

నేను ఆరోజు పిలిస్తే నిన్ను కెప్టెన్ చేయడానికి రాలేదని, డ్రామాలు ఆడుతున్నాడని చెప్పింది. అలాగే శివాజీ కూడా పెద్దవాడు అని వదలిలేశా అని ఇంక ఊరోకోను అని కూడా ప్రియాంకతో చెప్పింది. అంతేకాదు, అర్జున్ కి వాళ్లు కావాలనే సపోర్ట్ చేశారని, నెక్ట్స్ అర్జున్ మద్దతు వాళ్లకి కావాలని అదే వాళ్ల స్ట్రాటజీ అని నూరిపోసింది. దీంతో అమర్ మైండ్ నిండా ప్రశాంత్ గురించి నెగిటివిటీ నిండిపోయింది. టాస్క్ లో అది బయటపడింది. అంతేకాదు, జాకెట్ అండ్ బాల్స్ టాస్క్ లో శోభాశెట్టి ఫస్ట్ యావర్ ని ఎటాక్ చేస్తూ రెచ్చగొట్టింది. దీంతో యావర్ ట్రిగ్గర్ అయిపోయాడు.

బిగ్ బాస్ పై కోపంతో జాకెట్ ని నేలకేసి కొట్టాడు. బాల్స్ ని కాలితో తన్నాడు. గేమ్ నూంచీ ఫస్ట్ రౌండ్ లోనే ఇద్దరూ అవుట్ అయ్యారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఉన్న చోటు నుంచీ అమర్ ప్రశాంత్ ఉన్న దగ్గరికి వెళ్లి జాకెట్ కి బాల్స్ ని అంటించడానికి ప్రయత్నించాడు. వాళ్లిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇక్కడే పల్లవి ప్రశాంత్ చేస్తో అమర్ పీకపై చేయి వేస్తుంటే చేతిని కొరికాడు అని కంప్లైట్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. మాటకి మాట పెరిగింది. మెడికల్ రూమ్ కి వెళ్దాం పదా అంటే పదా అంటూ ఇద్దరూ ఆవేశపడ్డారు.

మద్యలో ఆగిపోతే మెడికల్ రూమ్ కి రమ్మంటే భయపడుతున్నావ్ అంటూ పల్లవి మాట్లాడాడు. ఆ మాటలకి బాగా ఫ్రస్టేట్ అయిపోయిన అమర్ రెచ్చిపోయి మరీ పల్లవి ప్రశాంత్ పై అరిచాడు. ముఖం పగిలిపోద్ది అన్నాడు. పిచ్చోడా అన్నాడు. ఇలా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నాడు. అంతేకాదు, పదా మెడికల్ రూమ్ కి వెళ్దాం అంటూ మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేస్తే నెట్టాడు. అన్నా, నెట్టద్దన్నా అని పల్లవి ప్రశాంత్ హెచ్చరిస్తున్నా కూడా వినే స్టేజ్ లో లేడు.

దీంతో అమర్ పూర్తిగా తన గేమ్ ని స్పాయిల్ చేస్కున్నాడు. దీనికి పూర్తిగా కారణం అమరే. శోభా కెప్టెన్సీ టాస్క్ లో తప్పించుకున్నాడు అని చెప్పిన దగ్గర్నుంచీ కడుపులో కక్ష్యపెట్టుకున్నాడు. అలాగే, అర్జున్ కావాలనే రాలేదు. నా ఫోటో కాలిపోతే నేను ఎందుకు వస్తా అని కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నాకు చెప్పాడంటూ చెప్పేసరికి ఇంకా రగిలిపోయాడు. అందుకే, వాడి గురించి మీకు తెలీదు. వాడు ఎలాంటి గేమ్ ఆడాడో నిజాలు బయటపెట్టాను అనుకో అప్పుడు తెలుస్తుందంటూ మాట్లాడాడు.

ఇక అర్జున్ మద్యలో కలిగించుకుని గట్టిగా అరుస్తూ ఇద్దరినీ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆ రౌండ్ లో ఎవరు అవుట్ అయ్యారు అనేదానిపైన శోభాశెట్టికి ఇంకా శివాజీకి గట్టిగా గొడవ జరిగింది. ఇక ఈ బాల్స్ టాస్క్ లో అర్జున్ మరోసారి గెలిచి ఓట్ అప్పీల్ కోసం కంటెండర్ అయినట్లుగా తెలుస్తోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus