Thalaivi Movie: బాక్సాఫీస్ వద్ద కంగనా రన్ అవుట్

టాలీవుడ్లో మొత్తానికి కొన్ని సినిమాలు అప్పుడప్పుడు బాక్సాఫీస్ కు మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. అయితే బాలీవుడ్ బిజినెస్ మాత్రం దారుణంగా పడిపోయిందని మరోసారి ఈ సినిమాతో క్లారిటీ గా అర్థమైంది. మొదట ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా బాలీవుడ్లో అంచనాలు పెరిగాయి. ఎందుకంటే చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగనా గతంలో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి.

ఎలాంటి సినిమా అయినా సరే మినిమం వసూళ్లను అందుకునేవి. కానీ ఈసారి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాతో మాత్రం ఆమె బాక్సాఫీసు వద్ద తన రేంజ్ కు తగినట్లు ఓపెనింగ్స్ ను అయితే అందుకోలేదని అర్థమవుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. తెలుగు తమిళ్ బాలీవుడ్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే దారుణమైన చేదు అనుభవం ఎదురైంది. కంగనా గత సినిమాలతో పోలిస్తే తలైవి కొంచెం కూడా నిలదొక్కుకోలేకపోయింది.

శుక్రవారం అనంతరం కూడా ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక పోవడం విశేషం. 100కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న కంగనా రనౌత్ ఇలాంటి పెద్ద సినిమాతో మాత్రం ఒక్కసారిగా కిందకు పడిపోయింది. మొదటి రోజు కనీసం కోటి రూపాయల షేర్ కూడా దక్కలేదు. ఫస్ట్ డెనే ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయంటే మిగతా రోజుల్లో పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus