Dulquer Salmaan, Adivi Sesh: టాలీవుడ్‌ – మాలీవుడ్‌ కాంబోకి సర్వం సిద్ధం… రేపో మాపో?

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలో ఇప్పుడు మల్టీస్టారర్‌ల టైమ్‌ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఏదో ఒక మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్‌. అయితే కొన్ని చోట్ల మల్టీస్టారర్‌లు కాస్త మల్టీ టాలెంటెడ్‌ మల్టీస్టారర్‌లు అవుతున్నాయి. అలా ఇప్పుడు తెలుగు రిలేటెడ్‌గా ఇలాంటి ఓ సినిమా రూపొందుతోంది. అందులో హీరోలుగా మనకు బాగా తెలిసిన మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, మన తెలుగు హీరో అడివి శేష్‌ నటిస్తారని టాక్‌.

రెండు భాష‌ల‌కు చెందిన స్టార్‌ హీరోలతో సినిమాలు చేయ‌డానికి మన దర్శకనిర్మాతలు ఈ మధ్య మ‌క్కువ‌ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఓ పెద్ద నిర్మాణ సంస్థ మ‌ల‌యాళం నుండి దుల్క‌ర్ స‌ల్మాన్.. తెలుగు నుండి అడివి శేష్‌ను క‌లిపి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది అని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అని సమాచారం. ఈ సినిమా దర్శకుడు కూడా దాదాపు ఓకే అయ్యారట.

ప్రముఖ దర్శకుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఓ యువ ద‌ర్శ‌కుడు చక్కని క‌థను రాసుకున్నారట. ఇద్దరు తెలుగు హీరోలతో సినిమా అని తొలుత అనుకున్నా… ఇప్పుడు దానిని మల్టీ లాంగ్వేజ్‌ హీరోల మల్టీస్టారర్‌ చేస్తున్నారట. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ ప్రయత్నాలు వేగవంతం చేసిందట. ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోల‌కూ క‌థ‌ వినిపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారట. ఇద్ద‌రు హీరోలూ త‌మ నిర్ణ‌యాన్ని చెప్పాల్సి ఉందట.

మరోవైపు అడివి శేష్, దుల్క‌ర్ సల్మాన్‌ (Dulquer Salmaan) క‌థ‌ల విష‌యంలో చాలా పక్కాగా ఉంటారు. కొత్తదనం ఉంటే వదిలిపెట్టే ప్రస్తక్తే లేదు. అలాంటి స్పెషల్‌ ఎలిమెంట్‌ ఈ కథలో ఉంది అని చెబుతున్నారు. అలాగే కేవలం నటనను మాత్రమే పట్టించుకునే రకం కూడా కాదు. అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. కాబట్టి ఈ మల్టీటాలెంటెడ్‌ మల్టీస్టారర్‌ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus