దుల్కర్ సల్మాన్ “అతడే” ఆడియో లాంచ్

వెంకటసాయి ప్రియాన్సీ క్రియేషన్స్ పతాకంపై నాజర్ ,సుహాసిని ప్రధాన పాత్రలుగా దుల్కర్ సల్మాన్ ,నేహాశర్మ ,ధన్సిక హీరో హీరోయిన్స్ గా బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో తమిళ ,మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయిన “సోలో “సినిమాను ప్రముఖ నిర్మాత వెంకటేష్ గాజుల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న “అతడే ” సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది .ఈ ఆడియో కు ముఖ్య అతిధిగా వచ్చిన రాజ్ కందుకూరి బిగ్ సీడీ ను మరియు ఆడియో ను విడుదలచేసి మొదటి సీడీ ను డాక్టర్ గౌతమ్ కశ్యప్ గారికి ,నిర్మాత వెంకటేష్ కు అందించారు …

ఈ సందర్బంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ :- ఈ సినిమాలో 4 రకాల డిఫ్రెంట్ స్టోరీస్ కలసి ఉంటాయి,హీరో అన్ని షేడ్స్ లలోను బాగా నటించాడు. ప్రొడక్షన్ ,టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి,సినిమా చూస్తే డబ్బింగ్ సినిమా అనే ఫీల్ కలగదు,ఇలాంటి మంచి కాన్సెప్ట్ ను ఎంచుకొని తెలుగు లో మనకు అందిస్తున్న వెంకటేష్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు ..

నిర్మాత వెంకటేష్ గాజుల మాట్లాడుతూ:-బాస్కరపట్ల,పూర్ణాచారి లు మంచి లిరిక్స్ అందించారు,గోవింద్ మీనన్ ,ప్రశాంత్ పిళ్ళై లు అందించిన మ్యూజిక్ అందరికి నచ్చుతుందన్నారు,ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగు లో కూడా మంచి హిట్ అవుతున్నందని ఆశిస్తున్నానన్నారు ..మాటల రచయితలు dr గౌతమ్ కశ్యప్ మాట్లాడుతూ :-మేము రాసిన లాస్ట్ సినిమా “కుందనపు బొమ్మ”విజయం సాధించలేదు,డబ్బింగ్ సినిమాలకు మేము ఎప్పుడూ మాటలు వ్రాయలేదు,,మాకు ఆత్మ సంతృప్తి చెందేలా కథ నచ్చడం తో ఈ సినిమాకు మాటలు వ్రాశాము.

లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడుతూ:-మాకు సింగర్స్ మంచి సహకారం అందించారు,తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న వెంకటేష్ గారికి అక్కడ విజయం సాధించినట్లే తెలుగు లో కూడా మంచి విజయం సాదించి,మరిన్ని చిత్రాలు నిర్మించాలని అన్నారు…ఇంకా ఈ కార్యక్రమం లో నటీనటులు,సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయవంతం కావాలని మాట్లాడారు…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus