Dulquer Salmaan: ఆ డైరక్టర్‌ దుల్కర్‌ సల్మాన్‌ కలసి పని చేయబోతున్నారా?

  • August 20, 2022 / 12:24 PM IST

‘సీతారామం’ సినిమాకు ముందు దుల్కర్‌ సల్మాన్‌ మనకు కొత్తేమీ కాదు. అప్పటికే ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. దీంతో బాగానే పరిచయం అయ్యాడు. ‘ఓకే బంగారం’, ‘కనులు కనులను దోచాయంటే’ లాంటి సినిమాలు వచ్చాయి. కానీ స్ట్రయిట్‌ తెలుగు సినిమా అయితే మాత్రం ‘సీతారామం’ చిత్రమే. లెఫ్టినెంట్‌ రామ్‌గా అందరినీ ఆకట్టుకున్న దుల్కర్‌.. ఇప్పుడు రెండో స్ట్రయిట్‌ మూవీకి ఓకే చెప్పాడని సమాచారం.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి దుల్కర్‌ సల్మాన్‌ ఓకే చెప్పాడని అంటున్నారు. దుల్కర్ కోసం శేఖర్ కమ్ముల అదిరిపోయే కథ సిద్ధం చేశారని, ఇటీవల దుల్కర్‌కి చెప్పడం కూడా పూర్తయింది అని అంటున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుందని చెబుతున్నారు. తెలుగు, తమిళం, మాలయాళంలో ఈ సినిమా ఒకేసారి రూపొందుతుంది అని చెబుతున్నారు. అయితే మరి దీనికి నిర్మాత ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం తమిళ హీరో ధనుష్‌తో చేయాల్సిన సినిమా కథను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా అయిపోయింది. వెంకీ అట్లూరితో ధనుష్ చేస్తున్న ‘సర్’ సినిమా తర్వాత శేఖర్‌ కమ్ముల సినిమా ఉంటుంది. ఆ సినిమా తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ సినిమాను శేఖర్‌ కమ్ముల స్టార్ట్ చేస్తారట. అయితే ధనుష్‌ సినిమా కంటే ముందే దుల్కర్‌ సినిమా ఉండొచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక దుల్కర్‌ సంగతి చూస్తే.. ‘చుప్‌’ అనే హిందీ సినిమాను ఇటీవల పూర్తి చేసుకున్నాడు. ఇంకేం కొత్త సినిమాలు అనౌన్స్‌ చేయలేదు. అయితే కొన్ని చర్చల దశలో ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు దుల్కర్‌కి ఉన్న ఇమేజ్‌ ప్రకారం చూస్తే.. ఏ సినిమా చేసినా కచ్చితంగా తెలుగు, మలయాళంలో ఉంటాయి. హిందీ సినిమాను మరి తెలుగులోకి తీసుకొస్తారో లేదో చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus