Dulquer Salmaan: దుల్కర్ కొత్త సినిమా టీజర్ విడుదల మహేష్… కృతజ్ఞతలు తెలిపిన దుల్కర్!

మలయాళ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనంతరం సీతారామం వంటి పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ అనంతరం ఆయన మలయాళంలో నటించిన సినిమాలన్నింటిని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే (Dulquer Salmaan) దుల్కర్ సల్మాన్ నటి ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం కింగ్ ఆఫ్ కోట.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు.మలయాళంలో ఈ సినిమా టీజర్ ను సీనియర్ హీరో దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి విడుదల చేశారు.

ఇక తెలుగులో ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ విధంగా మహేష్ బాబు ఈ సినిమా టీజర్ విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. కింగ్ ఆఫ్ కోట టీజర్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దుల్కర్ సల్మాన్ మరోసారి ఆకట్టుకునే పాత్రలో చూస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ తెలియచేయడమే కాకుండా చిత్ర బృందానికి ఈయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విధంగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో వెంటనే మహేష్ బాబు చేసినటువంటి ట్వీట్ పై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ… థాంక్యూ సో మచ్ అన్న అంటూ మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా మహేష్ బాబు వంటి అగ్ర హీరో తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాము. ఇప్పుడు మా చిత్ర బృందం మరింత సంతోషంలో ఉన్నాము అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus