కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తూ ఉండగానే ఎవ్వరూ ఊహించని రేంజ్ మార్పులతో పెద్దవాళ్ళు అయ్యిపోతున్నారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళని చూస్తే చిన్నప్పుడు మనం చూసిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఈ రేంజ్ లో మారిపోయాడా అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటి సందర్భాలు ఇటీవల కాలం లో ఎన్నో జరిగాయి. అలా బాల నటుడు గా ప్రసిద్ధి చెంది ఇప్పుడు హీరో గా మారిపోయిన నటుడు సాత్విక్ వర్మ. కుమారి 21 F , గుంటూరోడు, మళ్ళీ రావా, ఓ మై ఫ్రెండ్, సవ్య సాచి వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించాడు సాత్విక్ వర్మ.
ఈయన బాలనటుడిగా నటించిన చివరి చిత్రం ‘దువ్వాడ జగన్నాధమ్’. ఇతను ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలు ఉలిక్కిపడే రేంజ్ లో ఎంతో స్టైలిష్ గా మారిపోయాడు. ఇతన్ని చూస్తే చిన్నప్పుడు మనమంతా చూసిన సాత్విక్ యేనా అని అనిపిస్తాది, ఆ రేంజ్ లో మారిపోయాడు. ఇతను పెద్ద అయ్యాక హీరో గా మారి చేసిన చిత్రం ‘బ్యాచ్’. ఈ సినిమా 2021 వ సంవత్సరం లో విడుదలైంది.
పాపం సాత్విక్ ( Sathvik Varma ) బ్యాడ్ లక్ ఏమిటంటే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యింది, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఆ రేంజ్ లో ఆడింది అన్నమాట. అయితే ఈ కుర్రాడ్ని చూస్తుంటే ప్రస్తుతం ఉన్న మీడియం రేంజ్ హీరోల కంటే బాగున్నాడు. మంచిగా నటిస్తున్నాడు కూడా. ముఖం లో ఎలాంటి హావభావాలు అయినా పలికించగలడు అని అనిపిస్తుంది.
ఒక మంచి డైరెక్టర్ తో, సరైన స్క్రిప్ట్ తో సినిమా చేస్తే కచ్చితంగా ఇతను మరో లెవెల్ కి వెళ్తాడు. కానీ ఎం చేస్తాం, బ్యాక్ గ్రౌండ్ లేని కుర్రాడు, టాలెంట్, అందం ఉన్నప్పటికీ కూడా అదృష్టం మాత్రం లేదు. అందుకే 2021 తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. భవిష్యత్తులో అయినా ఇతని తలరాత మారుతుందో లేదో చూడాలి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు