టైమ్ కలసి రానప్పుడు తాడు పట్టుకున్నా పాములా మారి కరుస్తుంది అంటారు…ఇప్పుడు డీజె విషయంలో అదే జరుగుతూ ఉంది…అసలు విషయం ఏంటి అంటే…టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ ఆళ్ళు అర్జున్ కి నిన్న తెలుగు ప్రేక్షకులు ఝలక్ ఇచ్చారు…ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’కు కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న రిసల్ట్ ను అందించారు మన వాళ్ళు. అయితే అదే క్రమంలో ఈ సినిమా పై భారీ అంచనాలతో అధిక మొత్తంలో డబ్బులు పెట్టి కొన్న బయ్యర్స్ కి ఇప్పుడు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు…వాళ్ళు సేఫ్ జోన్ లోకి రావాలంటే చాలా కష్టం అనే చెప్పాలి…అయితే ఆ గొడవ అంతా ఒక ఎత్తు అయితే…ఇక్కడ మరో గొడవ ఒకటి కొత్తగా మొదలయింది…ఈ సినిమా విషయంలో బ్రాహ్మణులు కాస్త కోపంగా ఉన్నారు అన్న విషయం బహిరంగమే…అయితే సినిమా విడుదలకు ముందు ఒక ఎత్తు వివాదాల్లో ఈ సినిమా ఇరుక్కుంటే…మరో పక్క సినిమా విడుదల తరువాత మరో రకమైన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది ఈ సినిమా…ఆ వివాదం ఏంటి అంటే….ఒకసారి ఈ కధ చదవండి….గాయత్రీ మంత్రాన్ని హిందూ మతంలో ఉండే ప్రతీ వ్యక్తీ పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ మంత్రాన్ని పఠించటానికి కూడా సమయాన్నీ, స్థలాన్నీ పరిగణ లోకి తీసుకుంటారు. చెప్పులు వేసుకొనీ, శరీరం అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ ఈ మంత్రాన్ని పఠించటం దోషంగా భావిస్తారు.
ఇప్పుడు అదే తప్పు ‘దువ్వాడ జగన్నాథం’ లో జరిగింది అంటూ మరో వివాదం మొదలైంది. 24 ముద్రలతో 24 వైబ్రేషన్స్ తో ఉండే గాయత్రి మంత్రాన్ని ‘దువ్వాడ’ లో హీరో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని చదవడం హిందువుల మనో భావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంలో బన్నీ గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకుని చదివే సందర్భం కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు దర్శకత్వం వహించిన సినిమాలో గాయత్రి మంత్రానికి ఇలాంటి అవమానాలు ఏమిటి అన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోత్తాగం చూసుకుంటే ఒక పక్క ఫ్లాప్ టాక్…మరో పక్క ఈ వివాదాలు అన్నీ వెరసి బయ్యర్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.