బాహుబలి 2 వల్ల డీజే రిలీజ్ వాయిదా
- March 18, 2017 / 12:01 PM ISTByFilmy Focus
సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన డీజే టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల లోపున కంప్లీట్ చేసి వచ్చే నెల రెండవ వారంలో రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. కానీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. కారణం బాహుబలి కంక్లూజన్ అని సమాచారం. రాజమౌళి, ప్రభాస్ నాలుగేళ్ల పాటు శ్రమించి రూపొందించిన బాహుబలి 2 ట్రైలర్ రెండురోజుల క్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించింది.
ఒక్క రోజులోనే 5 కోట్ల వ్యూస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో బాహుబలి కి పోటీగా దిగాలని ఆశ టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో తుడిచి పెట్టుకు పోయింది. అందుకు ఏప్రిల్ ల్లో రిలీజ్ చేసే ఆలోచనను దిల్ రాజు విరమించుకున్నారు. బాహుబలి ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది. ఆ చిత్ర క్రేజ్ తగ్గిన తర్వాత… అంటే ఇరవై రోజుల తర్వాత మే 19 న డీజే ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















