రాజమౌళి, ఎన్టీఆర్,చరణ్ వంటి స్టార్లతో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు డీవీవీ దానయ్య. దీంతో ఇతని ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ దేశవిదేశాల్లో కూడా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ అనే మరో పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు దానయ్య. అయితే ఆయన నిర్మించిన గత సినిమాల గురించి ఎక్కువమందికి తెలిసుండకపోవచ్చు.’భరత్ అనే నేను’ ‘జులాయి’ ‘నాయక్’ ‘దేశముదురు’ వంటి హిట్ సినిమాలు ఈయన నిర్మించినవే.
అయితే ఎందుకో ఈయన హిట్ సినిమాలను పక్కన పెట్టి ప్లాప్ సినిమాని తలుచుకుంటూ ఎక్కువ సంతోషపడిపోతున్నట్టు తెలుస్తుంది. అవును కొన్ని గంటల ముందు ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పడింది. ఇందులో ‘నేనింతే’ సినిమాకి 15 ఏళ్ళు పూర్తయినట్టు రాసి ఉంది. ఈ ట్వీట్ ను మరింతగా గమనిస్తే.. ‘సినిమా సినిమా సినిమా.. ఎంత ఇష్టం అంటే.. 15 ఏళ్ళు అని 12 గంటలకు గుర్తు చేసుకునేంత’ అంటూ ఆ సినిమా ‘ #Neninthe , #15YearsOfNeninthe ‘ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు.
2008 వ సంవత్సరంలో డిసెంబర్ 19 న ‘నేనింతే’ సినిమా రిలీజ్ అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ.. సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పూరి. అలాగే ఈ సినిమాలో చాలా ఫిలాసఫీ కూడా ఉంటుంది. టీవీల్లో చూసినప్పుడు అది బాగానే అనిపించినా థియేటర్లో ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్ అవ్వలేదు.
ఇక ‘నేనింతే’ సినిమాకి గాను రవితేజకి.. ఉత్తమ నటుడు కేటగిరిలో నంది అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను మీమ్ పేజెస్ కూడా తెగ వాడుతూ ఉంటాయి. ఇప్పటి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ మూవీలో చిన్న అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే.. దానయ్య ‘నేనింతే’ సినిమాని 15 ఏళ్లు అయినా మర్చిపోలేకపోతున్నాడు అనుకోవాలి.
https://twitter.com/DVVMovies/status/1736816185453183457
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!