Eagle: సోలో రిలీజ్ డేట్ కావాలంటున్న ఈగల్ నిర్మాతలు.. వాళ్లు తప్పుకుంటారా?

రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీ ఈ నెల మొదటి వారంలోనే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉండటంతో సోలో రిలీజ్ డేట్ హామీ ప్రకారం ఈగల్ మేకర్స్ వెనక్కు తగ్గారు. అయితే ఈగల్ మూవీ ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా అదే సమయానికి వేర్వేరు సినిమాలు రిలీజవుతున్నాయి.

యాత్ర2 మూవీ ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన, లాల్ సలామ్ రిలీజవుతున్నాయి. తాజాగా సందీప్ కిషన్ తమ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈగల్ నిర్మాతలు తమ సినిమాకు సోలో రిలీజ్ డేట్ కావాలంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ దక్కకపోతే రవితేజ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫిబ్రవరి 9 సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈగల్ సినిమా ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈగల్ సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు ఉంటాయని ఈ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెబుతుండటం గమనార్హం.

సూర్య వర్సెస్ సూర్య సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న కార్తీక్ తెలుగులో చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈగల్ సినిమా సక్సెస్ సాధిస్తే కార్తీక్ ఘట్టమనేని రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీక్ ఘట్టమనేని కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈగల్ (Eagle) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus