Mr Bachchan: ‘ఈగల్’ నష్టాలు అలా తీర్చేస్తామంటున్న నిర్మాతలు!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా ఇటీవల అంటే ఫిబ్రవరి 9 న రిలీజ్ అయ్యింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మొదటి షోతో ఈ మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ వీక్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ తగ్గిపోయాయి. రెండో వీకెండ్ ను కూడా పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది.

అన్ సీజన్ కావడం వల్ల.. బాక్సాఫీస్ వద్ద ‘ఈగల్’ సత్తా చాటలేకపోయింది. మరోపక్క ఈ సినిమాకి రిలీజ్ కి ముందు ఓటీటీ బిజినెస్ కూడా కాలేదు అని నిర్మాతే స్వయంగా చెప్పారు. అది కూడా తాము చేస్తున్న పెద్ద రిస్క్ అని చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద ‘ఈగల్’ నష్టాలనే మిగిల్చింది. దీంతో ‘ఈగల్’ నష్టాలను తీర్చే బాధ్యత ఇప్పుడు హరీష్ శంకర్ పై పడినట్టు అయ్యింది.

ఎలా అంటే.. ? ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లోనే రవితేజ మరో సినిమా చేస్తున్నాడు. అదే ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అతని సినిమాలు అంటే ట్రేడ్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో రవితేజ- హరీష్..ల కాంబోకి భీభత్సమైన క్రేజ్ ఉంటుంది. ఆ రకంగా చూస్తే ‘మిస్టర్ బచ్చన్’ కి (Mr Bachchan) మంచి థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. అలా ‘ఈగల్’ నష్టాలు కూడా అడ్జస్ట్ అయిపోతాయన్న మాట.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus