రవితేజ నటించిన ఈగల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది. రవితేజ అభిమానులు ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. బుక్ మై షోలో ఈ సినిమాకు 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఏఎంబీ సినిమాస్ లో అన్ని షోలకు ఈ సినిమాకు 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంది.
ఈగల్ సినిమాకు చివరి 40 నిమిషాలు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్ రేటు 200 రూపాయలుగా ఉండగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలుగా ఉంది. ఈగల్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ విషయంలో మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కార్తీక్ ఘట్టమనేని రేంజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని ఏరియాలలో ఈగల్ మూవీ బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. రవితేజ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారు.
తన సినిమాల కోసం రవితేజ ఎంతో కష్టపడుతున్నారు. రవితేజ రెమ్యునరేషన్ 25 నుంచి 28 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. రవితేజ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. మాస్ మహారాజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఈగల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. (Eagle Movie) ఈ సినిమాలోని క్లైమాక్స్ ట్విస్ట్ ఊహలకు అందని విధంగా ఉండనుందని భోగట్టా.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!