Eagle Twitter Review: ‘ఈగల్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..ఎలా ఉందంటే?

మాస్ మహారాజ రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాఫర్ హీరోయిన్లుగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈగల్’. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.మొదట జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో సోలో రిలీజ్ డేట్ కోసం వాయిదా వేశారు. అలా ఈ సినిమా ఫిబ్రవరి 9న అంటే మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది.టీజర్, ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా.. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుందట. మొదట కొంచెం కన్ఫ్యూజ్ చేసినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి గ్రిప్పింగ్ గా అనిపిస్తాయట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రొటీన్ గా అనిపించినా.. క్లైమాక్స్ మాత్రం టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట.

మొత్తంగా ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామా అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. టార్గెటెడ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయట. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..

Click Here to Read Main Review

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus