తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఒక్కసారిగా డ్రగ్స్ కేసులో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఉండడం అందరిని షాక్ కు గురి చేసింది. అసలు వారికి ఎంత వరకు సంబంధాలు ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. కొన్నేళ్ల క్రితం అంతా ముగిసిపోయింది అనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో ఈసారి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ దృష్టికి వెళ్లడంతో ఈ కేసులో పెద్ద విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ తీసుకోవడం ఒక అంశం అయితే ఆ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ఎవరు ఎంత ఖర్చు చేశారనేది మరొక కీలకమైన అంశం. విదేశాల నుంచి ఒక స్టార్ సెలబ్రెటీ కనుసైగలతోనే డ్రగ్స్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బు కట్టింది ఎవరు? ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి అనేది అసలు పాయింట్. ఈ కేసులో లావాదేవీలపై గుట్టు తెలిస్తే ప్రముఖుల ఆస్తుల్ని ఎటాచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017లోనే టాలీవుడ్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా అయినట్లు కేసు నమోదైంది. ఇక ఆ తరువాత పబ్ యజమానిగా ఉన్న స్టార్ సెలబ్రెటీ నుంచి లావాదేవీలు జరిగినట్లు టాక్ వచ్చింది.
అయితే ఈడీ గుట్టు లాగినా కూడా బినామీ పేర్లతో డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యి ఉంటే ఆ సెలబ్రెటీ తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే బలమైన సాక్ష్యాల కోసం అధికారులు విచారణను మరింత సీరియస్ గా కొనసాగిస్తున్నారు. ఇక మంగళవారం నుంచి ఇండస్ట్రీలోని 12 మంది ప్రముఖుల్ని డ్రగ్స్ కేసుకు సంబంధించి వివిధ అంశాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. వీళ్లలో పూరి జగన్నాధ్, చార్మి, రానా, రకుల్, రవితేజ వంటి స్టార్స్ ఉన్నారు. సినీ స్టార్స్ ఎకౌంట్ నుంచే డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తిస్తే.. ఫెమా చట్టాన్ని అమలు చేసేందుకు కూడా ఈడీ సిద్ధమౌతున్నట్టు కథనాలు వస్తున్నాయి.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!