Eesha Rebba: ఆ కారణంగానే ఈషా రెబ్బాకు ఛాన్స్ రావడం లేదా..!

  • December 2, 2023 / 07:38 PM IST

ఈషా రెబ్బా.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా తనదైన అందం, అభినయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సందడి చేస్తుంది. ఈషా రెబ్బా సినిమాల్లో అయితే నటిస్తుంది కానీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతూనే ఉంది. ఇమె మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే తెలుగు పిల్ల ఈషా రెబ్బా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే మూవీతో నటిగా వచ్చింది.

ఇందులో చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తింపు పొందింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగమ్మాయి ఈషా రెబ్బకి అంతకముందు ఆ తర్వాత, అమీ తుమీ చిత్రాలతో మంచి సక్సెస్‌లు ఇచ్చాడు. కాఈ, ఈషా ఆ సక్సెస్‌లను వాడుకోవడంలో సెక్సెస్ కాలేదు. అరవింద సమేత లాంటి సినిమాలలో సెకండ్ లీడ్ ఇంకా చెప్పాలంటే ఈ రోల్ కి అసలు ప్రాధాన్యం ఉండదు. అలాంటి సినిమాలు చేసి తన కెరీర్ ని తనే నాశం చేసుకుంది.

ఈషా కి మంచి ఫిజిక్ పర్సనాలిటీ ఉంది. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరితోనూ నాగార్జున లాంటి హీరోలతోనూ నటించే అవకాశాలు అందుకోవచ్చు. కానీ, తెలుగమ్మాయి కావడం..సరైన కథలను ఎంచుకోకపోవడం ఆమె కెరీర్ దెబ్బతినేలా చేశాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా రెచ్చిపోతోంది. ఈ తెలుగమ్మాయి కి మంచి సినిమాలు రావాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈషా రెబ్బా (Eesha Rebba) ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా చేసింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు యాక్టింగ్ పరంగానూ ప్రశంసలు దక్కాయి. ఈషా రెబ్బా.. తన కెరీర్‌లో ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus