Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటితో 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. కృష్ణంరాజు సోదరుడు, టాలీవుడ్ నిర్మాత అయినటువంటి సూర్య నారాయణ రాజు తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉప్పలపాటి వెంకట ప్రభాస్ వర్మ. అయితే అప్పటికే కృష్ణంరాజు.. ప్రభాస్ ను దత్తత తీసుకున్నారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. రైటర్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్న ప్రభాస్.. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Eeshwar

‘టక్కరి దొంగ’ వంటి పెద్ద బడ్జెట్ సినిమాతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన జయంత్ సి పరాన్జీ, దర్శకుడు తేజ స్టైల్లో ఓ లో బడ్జెట్ సినిమా చేయాలి అనుకున్నారు. అందుకు హీరోగా ప్రభాస్ ని ఎంపిక చేసుకున్నారు. ప్రభాస్ ని హీరోగా లాంచ్ చేస్తున్నట్టు కాకుండా.. ఓ కొత్త హీరోతో చిన్న బడ్జెట్లో సినిమా చేస్తున్నట్టే ఈశ్వర్ తీశారు.అలా కోటి రూపాయల బడ్జెట్లో సినిమాని 45 రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ చేశారు.

విలన్ గా అనేక సినిమాల్లో నటించిన కొల్లా అశోక్ కుమార్ ఇందులో విలన్ గా నటించారు. అలాగే ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. 2002 నవంబర్ 11న ‘ఈశ్వర్’ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రభాస్,కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా శివ భక్తులు అనే సంగతి తెలిసిందే. మొదటి సినిమా పేరు కూడా ‘ఈశ్వర్’. అందుకే ఆ పరమ శివుని ఆశీస్సుల కోసం ఈ సినిమాని సోమవారం రోజున విడుదల చేశారు.

వీకెండ్ రిలీజ్ అయితే సినిమాకి ఓపెనింగ్స్ బాగా వస్తాయి అనే సెంటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. వీక్ డేస్ లో సినిమా నిలబడాలి అన్నా.. వీకెండ్ లో వచ్చే టాక్ కీలకం. కానీ ‘ఈశ్వర్’ విషయంలో రివర్స్ అయ్యింది. మొదట ఈ సినిమాకి మంచి రిపోర్ట్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద సో సో పెర్ఫార్మన్స్ మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.

బాక్సాఫీస్ వద్ద రూ.1.8 కోట్ల షేర్ వచ్చింది. ‘ఈశ్వర్’ గుంటూరులోని ఓ థియేటర్లో స్ట్రైట్ గా 100 రోజులు ఆడింది. షిఫ్ట్..లతో కలుపుకుని 3 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం. ఇక 22 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ప్రభాస్ కెరీర్లో ‘ఈశ్వర్’ ఓ డీసెంట్ హిట్ మూవీగా చెప్పుకోవచ్చు.

రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus