నటి పూర్ణతో ఇమ్మానియేల్ అసభ్య ప్రవర్తన.. ఎంత ధైర్యం అంటూ రెచ్చిపోయిన పూర్ణ!

వెండితెర నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదివరకే ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కంటెస్టెంట్ లతో ఈమె ప్రవర్తించే తీరు పట్ల ఎంతో మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ప్రతి వారం గెస్ట్ గా సినీ ప్రముఖులు హాజరు అవుతారు.

ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ఈ వారం నటి పూర్ణ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పూర్ణ రాగానే హైపర్ ఆది యధావిధిగా పూర్ణ గారు నాకు ఒక హగ్గు కావాలి అంటూ అడిగారు. ఈ హగ్గులు ఇవ్వలేక తాను ఢీ నుంచి బయటకు వచ్చాను ఇక్కడ కూడా అంటూ తన పై పంచ్ లు వేస్తుంది.

ఇలా ఈ కార్యక్రమం అంతా ఎంతో సరదాగా ఆటపాటలతో సాగిపోతున్న తరుణంలో ఒక చిన్న పరిణామం చోటు చేసుకుంది.వేదికపై పూర్ణ మాట్లాడుతుండగా కమెడియన్ ఇమ్మానియేల్ పూర్ణతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పూర్ణ ఒక్కసారిగా కమెడియన్ ఇమ్మానియేల్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇమ్మానియేల్ తనని తాకడంతో స్పందించిన పూర్ణ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను తాకుతావు? నన్ను తాకడానికి నువ్వు ఎవరు? అంటూ అతని పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విధంగా పూర్ణ ఇమ్మానియేల్ ను నిలదీయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది వరకు పూర్ణ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన సరదాగా తీసుకునేవారు. మరి ఈ విషయంలో కూడా అలాగే సరదాగా తీసుకొని ప్రోమో హైలెట్ కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus