హీలింగ్ టైం అనేది పూరి జగన్నాథ్ కు సరిపోవడం లేదు అని స్పష్టమవుతుంది. ఈ మధ్యనే ‘లైగర్’ డిజాస్టర్ అని తెలిసిన తర్వాత నెల రోజుల పాటు బ్రేక్ తీసుకుని మైండ్ ను రీ ఫ్రెష్ చేసుకున్నాను అంటూ పూరి.. చిరుతో జరిగిన ఇన్స్టా లైవ్ చాట్ లో ముచ్చటించుకున్నారు. ‘మూడేళ్లు కష్టపడి ‘లైగర్’ చేశాను. అయిపోయింది అని మూడేళ్లు ఏడవలేను కదా’ అని పూరి చెప్పుకొచ్చాడు. కానీ పూరి.. ‘లైగర్’ ఎఫెక్ట్ నుండి కోలుకోలేకపోతున్నాడు.
ఈ మధ్యనే డిస్ట్రిబ్యూటర్లు పూరికి వార్నింగ్ ఇస్తూ లెటర్ రాయడం. ఆ తర్వాత పూరి అగ్రెసివ్ గా వారికి వాయిస్ మెసేజ్ పంపడం.. వంటివి అందరికీ తెలిసిందే. పూరి తనకు వచ్చిన అమౌంట్ లో కొంత అడ్జెస్ట్ చేస్తాను అని చెప్పినా బయ్యర్స్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం వంటివి మనం చూశాం. అది సైలెంట్ అయ్యింది కదా అనుకుంటే ఇప్పుడు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పూరి , ఛార్మీ లను పిలిచి విచారించడం హాట్ టాపిక్ అయ్యింది.
‘లైగర్’ సినిమా నిర్మాణం విషయంలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.అందుకే లైగర్ దర్శకుడు పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడీ 15 రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. చాలా సీక్రెట్ గా పూరి ఛార్మీతో కలిసి ప్రైవేట్ గా ఈడీ ఆఫీసుకు వెళ్లాడు.
ఉదయం నుండి ఈ జంటను ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది.విదేశీ పెట్టుబడులపై వీరిని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పూరి ఈ వివాదంలో ఎవరెవరి పేర్లు బయటపెడతాడు.. నిజంగానే రాజకీయ నేతలు ఈ సినిమా కోసం పెట్టుబడులు పెట్టారా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!