టాలీవుడ్ కు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసిరావడం లేదా?

ఈ మధ్య కాలంలో ప్రముఖ దర్శకులలో చాలామంది పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలకు టైటిల్స్ గా ఇంగ్లీష్ టైటిల్స్ పై దర్శకులు దృష్టి పెడుతున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది డైరెక్టర్లకు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ వరుస షాకులిస్తున్నాయి.

కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన సన్నాఫ్ ఇండియా ఏ రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుందో తెలిసిందే. రామ్ నటించిన ది వారియర్ సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య థాంక్యూ, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ఎఫ్3, మిషన్ ఇంపాజిబుల్, ఫస్ట్ డే ఫస్ట్ షో, హ్యాపీ బర్త్ డే, హీరో, సూపర్ మచ్చి, రౌడీ బాయ్స్, గుడ్ లుక్ సఖి, మిస్ ఇండియా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తో తెరకెక్కి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

అదే సమయంలో తెలుగు టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలు మాత్రం అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కుతాయో చూడాల్సి ఉంది. కొంతమంది దర్శకులు మాత్రం కొత్త తరహా టైటిల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలుగు సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus