‘ఎంత మంచివాడవురా’ 6 డేస్ కలెక్షన్స్..!

గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి… ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకుడు. జనవరి 15 న విడుదలైన ఈ చిత్రం… మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. అయినప్పటికీ పండగ సెలవులను బాగానే క్యాష్ చేసుకుంది. అయితే తరువాత పూర్తిగా చతికిలపడిపోయింది ఆనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.39 cr
సీడెడ్ 0.79 cr
ఉత్తరాంధ్ర 0.78 cr
ఈస్ట్ 0.91 cr
వెస్ట్ 0.63 cr
కృష్ణా 0.67 cr
గుంటూరు 0.65 cr
నెల్లూరు 0.23 cr
ఏపీ+తెలంగాణ 6.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.28 cr
ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 6.53 cr (share)

‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కేవలం 10 కోట్లకే జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.53 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 3.5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..! మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి..!

Click Here To Entha Manchivaadavuraa Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus